Gurnoor Brar: డేల్ స్టెయిన్‌లా టెస్టుల్లో ఆధిపత్యం సాధిస్తా.. టీమిండియా పేసర్ కీలక వ్యాఖ్యలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurnoor Brar: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అరంగేట్రం చేసిన భారత యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బరార్ తన తొలి అంతర్జాతీయ రెడ్ బాల్ వికెట్‌ను సాధించాడు. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజే న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వేను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసి టెస్టు కెరీర్లో తొలి వికెట్ అందుకున్నాడు. ఈ సందర్భంగా తన టెస్టు అరంగేట్రంపై గుర్నూర్ సంతోషం వ్యక్తం చేశాడు. నిజానికి న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభంలో గుర్నూర్ బరార్ భారత జట్టులో లేడు. అయితే, సిరీస్‌కు ముందు అతడిని జట్టులోకి తీసుకున్నారు. పేసర్లకు అనుకూలించే పిచ్‌లు ఉండే అవకాశం నేపథ్యంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను జట్టు నుంచి విడుదల చేశారు. అంతకుముందు వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన గుర్నూర్‌కు రెండో టెస్టులో ఆడే అవకాశం లభించింది.
ఈ నేపథ్యంలో భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడటం అద్భుతమైన అనుభూతి అని గుర్నూర్ పేర్కొన్నాడు. టీమిండియాలో భాగం కావడం తన అదృష్టమని తెలిపాడు. తన చిన్ననాటి క్రికెట్ ఆదర్శ ప్లేయర్ దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ అని చెప్పుకొచ్చాడు. టెస్టు క్రికెట్లో స్టెయిన్ ప్రత్యర్థి బ్యాటర్లపై చూపించే ఆధిపత్యం తనకు ఎంతో ఇష్టమని, తాను కూడా అదే తరహాలో రాణించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. మరోవైపు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంపై కూడా గుర్నూర్ ప్రశంసలు కురిపించాడు. గిల్ ఎంతో సహకారం అందించే కెప్టెన్ అని, బౌలర్లకు పూర్తి మద్దతు ఇస్తాడని పేర్కొన్నాడు. తమ ప్రణాళికలకు అనుగుణంగా బౌలింగ్ చేసేందుకు స్వేచ్ఛనిస్తాడని తెలిపాడు. అతడితో కలిసి ఆడటం చాలా బాగుందని చెప్పాడు.
Also Read
- Hyderabad: మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్యకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు..
- Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
- Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్‌లైన్
- AP Govt: మీకు గుంత కనిపించిందా.. వెంటనే ఇలా చేయండి.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం..
టెస్టు అరంగేట్రంలో తొలి వికెట్ సాధించడం తనకు ఎంతో ప్రత్యేకమైన క్షణమని గుర్నూర్ చెప్పుకొచ్చాడు. దీనితో ఉత్సాహంగా ఉన్నానని, మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. డేల్ స్టెయిన్ తరహాలో టెస్టు క్రికెట్లో తనదైన ముద్ర వేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు అతడు పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Gurnoor Brar: డేల్ స్టెయిన్‌లా టెస్టుల్లో ఆధిపత్యం సాధిస్తా.. టీమిండియా పేసర్ కీలక వ్యాఖ్యలు..!
-
Hyderabad: మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్యకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు..
-
Sunday Horoscope: 12 రాశుల వారి దిన ఫలాలు ఇవే.. ఆ రాశుల వారికి నేడు లక్కీ ఛాన్స్!
-
California Earthquake: అమెరికాలో భూకంపం.. 5.0 తీవ్రతతో కంపించిన కాలిఫోర్నియా
-
Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!