Jharkhand: ఆలయ దర్శనానికి వెళ్తుండగా విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand: జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో రాంచీ-పట్నా హైవే (Ranchi-Patna Highway) పై శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రాత్రి సుమారు రెండు గంటల సమయంలో ఎన్ హెచ్-33 (NH-33) లోని పైంకీ (Painki) ప్రాంతంలో స్కార్పియో (Scorpio) వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్‌లోని నలంద (Nalanda) జిల్లా జాంఘారో గ్రామానికి చెందిన 14 మంది ఒకే స్కార్పియో వాహనంలో రామ్‌గఢ్ జిల్లాలోని రజర్ప్ప ఆలయం (Rajrappa Temple)లో పూజలు చేయడానికి బయలుదేరారు. మార్గమధ్యంలో రామ్‌గఢ్‌లోని పైంకీ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం గుర్తుతెలియని వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే, ఘటన జరిగిన వెంటనే అక్కడ ఆర్తనాదాలు, తీవ్ర గందరగోళం నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులలో నలుగురు పిల్లలు, నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని సదర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. మొత్తం 14 మందితో ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం ఎన్ హెచ్-33 (NH-33) పై ఈ దుర్ఘటనకు గురైంది. దెబ్బతిన్న వాహనం పరిస్థితిని చూస్తే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా తెలుస్తోంది. చనిపోయిన వారంతా నలంద జిల్లాకు చెందిన వారని రామ్‌గఢ్ ఎస్డీపీఓ అలోక్ రంజన్ వెల్లడించారు. బాధితుల వద్ద లభించిన ఆధార్ కార్డుల (Aadhaar Cards) ఆధారంగా కొంతమంది వివరాలను గుర్తించామని, క్షతగాత్రుడికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని ఆయన తెలిపారు.
Also Read
- Gurnoor Brar: డేల్ స్టెయిన్‌లా టెస్టుల్లో ఆధిపత్యం సాధిస్తా.. టీమిండియా పేసర్ కీలక వ్యాఖ్యలు..!
- Hyderabad: మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్యకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు..
- Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
- Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్‌లైన్
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Jharkhand: ఆలయ దర్శనానికి వెళ్తుండగా విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి
-
Iran Starlink Report: అమెరికా సైనికులపై దాడులకు ఇరాన్ Starlink వినియోగం?.. ఎలాన్ మస్క్ ఆగ్రహం..!
-
Gurnoor Brar: డేల్ స్టెయిన్‌లా టెస్టుల్లో ఆధిపత్యం సాధిస్తా.. టీమిండియా పేసర్ కీలక వ్యాఖ్యలు..!
-
Hyderabad: మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్యకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు..
-
Sunday Horoscope: 12 రాశుల వారి దిన ఫలాలు ఇవే.. ఆ రాశుల వారికి నేడు లక్కీ ఛాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!