CSK vs DC: సంజు శాంసన్ షాందార్ సెంచరీ.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం!
- అద్భుత ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్
- సంజు శాంసన్ షాందార్ సెంచరీ
- ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. దాంతో ఢిల్లీకి 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ అద్భుత సెంచరీతో మెరిశాడు. 52 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న సంజు.. ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలి సెంచరీ బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఆయుష్ మాత్రే హాఫ్ సెంచరీ (59) హాఫ్ సెంచరీ చేయగా.. శివమ్ దూబే (20) కీలక రన్స్ చేశారు. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి సరైన ఆరంభం దక్కలేదు. ఐపీఎల్ 2026లో ఓపెనింగ్‌లో పెద్దగా రాణించని రుతురాజ్ గైక్వాడ్ (15) త్వరగానే అవుట్ అయ్యాడు. సంజు శాంసన్, ఆయుష్ మాత్రే జోడీ ఇన్నింగ్స్‌ను నిర్మించింది. మాత్రే 36 బంతుల్లో 59 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్‌గా వెళ్లగా.. సంజు మాత్రం మరో ఎండ్‌లో దూకుడుగా ఆడుతూ ఢిల్లీ బౌలర్లను ఆటాడుకున్నాడు. కేవలం 52 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన సంజు.. ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో తొలి శతకం నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
సంజు శాంసన్ 56 బంతుల్లో 115 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో శివమ్ దూబే (20 నాటౌట్) కూడా వేగంగా ఆడడంతో చెన్నై స్కోర్ 200 దాటింది. ముఖ్యంగా చివరి ఓవర్‌లో ముఖేశ్ కుమార్ 15 పరుగులు ఇవ్వడంతో సీఎస్‌కే భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక వికెట్ మాత్రమే పడగొట్టగా.. నటరాజన్, లుంగి ఎంగిడి భారీగా పరుగులు ఇచ్చారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!