Hardik Pandya: టైమ్‌అవుట్ సమయంలో తల తిరిగింది.. హార్దిక్ పాండ్య సంచలన వ్యాఖ్యలు!
- గుజరాత్ టైటాన్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం
- విజయంపై కెప్టెన్ హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు
- టైమ్‌అవుట్ సమయంలో గట్టిగా అరిచానన్న హార్దిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌పై కీలక విజయాన్ని సాధించిన అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అహ్మదాబాద్ వంటి కఠినమైన వేదికపై గెలవడం ఎప్పుడూ సవాలేనని, కానీ ఈసారి జట్టు సమిష్టిగా మంచి క్రికెట్ ఆడిందని తెలిపాడు. ఈ విజయం ముంబై జట్టుకు ఎంతో అవసరమని, అందుకే మరింత ప్రత్యేకంగా అనిపిస్తోందని పేర్కొన్నాడు. మ్యాచ్‌లో 14వ ఓవర్ టైమ్‌అవుట్ తర్వాత గట్టిగా అరిచానని, ఆ సమయంలో తల తిరిగిందని హార్దిక్ చెప్పుకోచ్చాడు. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయాల అనంతరం ముంబై విజయం సాధించింది.
‘చాలా ముఖ్యమైన విజయం ఇది. బయటి మైదానాల్లో గెలవడం ఎప్పుడూ సవాలే. ముఖ్యంగా అహ్మదాబాద్‌లో ముంబై ఇండియన్స్‌కు గెలుపు చాలా కష్టం. కానీ ఈరోజు మేము మంచి క్రికెట్ ఆడాం. ఈ విజయం చాలా అవసరం, అందుకే ఇది మరింత ప్రత్యేకంగా అనిపిస్తోంది. టైమ్‌అవుట్ సమయంలో నేను తిలక్ గురించి ఆలోచించాను. అతనిలో ఉన్న ప్రతిభను చూస్తే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను అతనికి చెప్పింది ఒక్కటే.. ఏం జరిగినా బాల్‌ను గమనించి, బలంగా కొట్టు అని. తిలక్ బ్యాటింగ్ స్ట్రైకింగ్ అద్భుతం. ఇలాంటి ఇన్నింగ్స్ అతనికి కొత్త కాదు. టైమ్‌అవుట్లో కొన్ని సార్లు చాలా గట్టిగా చెప్పాను. దాంతో నాకు తల తిరిగినట్టే అయింది (నవ్వుతూ). ఈ ఇన్నింగ్స్ జట్టుకు, తిలక్‌కు, ముంబై ఇండియన్స్‌కు చాలా అవసరం. కెప్టెన్‌గా కూడా ఇలాంటి ఎనర్జీ చాలా మార్పు తీసుకొస్తుంది’ అని హార్దిక్ తెలిపాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Tilak Varma: ఎక్కువ సమయం లేదు.. తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
‘చాలామంది బుమ్రా ఎందుకు మొదటి ఓవర్ వేయడు? అని అడుగుతుంటారు. బుమ్రా ఇప్పటికే చాలా మ్యాచ్‌లు ఆడాడు. అందులో కొన్ని సార్లు మాత్రమే తొలి ఓవర్ వేశాడు. ఇది హార్దిక్ సమస్య కాదు. బుమ్రా ఎంతో ప్రత్యేకమైన బౌలర్. జట్టుకు అవసరమైనప్పుడు ఎక్కడైనా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు కొత్త బంతితో ప్రభావం చూపాలనుకున్నాం, అందుకే అతడికి బంతిని ఇచ్చాను. యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. జట్టుకు ఈ ఎనర్జీ చాలా అవసరం. డెబ్యూ చేసిన క్రిష్ బాగా బౌలింగ్ చేశాడు. అశ్వని అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. గతంలో కూడా అతడు మ్యాచ్ మోమెంటమ్ మార్చాడు. ఫీల్డింగ్ కూడా బాగుంది. నమన్‌ను ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ఈ విజయం మాకు మలుపు అవుతుంది’ అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
-
Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
-
Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?