Hardik Pandya: హార్దిక్ కెప్టెన్ కాకపోయుంటే ముంబై గెలిచేది.. ఎంఐ బుల్లి ఫ్యాన్ ఫైర్!
- ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన
- నాలుగు మ్యాచ్‌లలో ఒకటే విజయం
- హార్దిక్ కెప్టెన్ కాకపోయుంటే ముంబై గెలిచేది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై ఇండియన్స్ అంటే.. ఒకప్పుడు ప్రత్యర్థి జట్లకు వెన్నులో వణుకు పుట్టేది. భీకర బ్యాటింగ్, అంతకుమించి బౌలింగ్ లైనప్‌తో ప్రత్యర్థులను మట్టికరిపించేది. అతి తక్కువ కాలంలో ఐదు ట్రోఫీలు సాధించిన ముంబై.. ఐపీఎల్లో ప్రత్యేక ముద్ర వేసింది. అలాంటి ముంబై జట్టు కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శన చేస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ 2026లో చెత్త ప్రదర్శన చేస్తూ.. అభిమానులను నిరాశపర్చుతోంది. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటే గెలిచి.. అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. టాప్ బౌలర్లు ఉన్నా.. 240 పరుగుల భారీ స్కోరును సమర్పించుకోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ శాంట్నర్ వంటి మేటి బౌలర్లు జట్టులో ఉన్నప్పటికీ.. బెంగళూరు బ్యాటర్లను అడ్డుకోలేకపోయారు. ఇది పూర్తిగా కెప్టెన్ హార్దిక్ పాండ్య వైఫల్యమే అని ముంబై ఫాన్స్ అంటున్నారు. మ్యాచ్ అనంతరం ఓ ముంబై బుల్లి ఫ్యాన్ మాట్లాడుతూ.. హార్దిక్ కెప్టెన్ కాకపోయుంటే ముంబై ఈ మ్యాచ్ గెలిచేదన్నాడు. బుమ్రా, బౌల్ట్, సాంట్నర్ ఉన్నా.. ముంబై 240 పరుగులు ఇవ్వడం అంగీకరించలేం అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెను చర్చకు దారి తీశాయి.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
హార్దిక్ పాండ్య స్ట్రైక్ రేట్ మెరుగుపర్చుకోవాలని ఆ ఫ్యాన్ సూచించాడు. బౌలింగ్‌లో వికెట్స్ తీయాలని, కెప్టెన్సీ ఇంకా బాగుండాలని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది జరిగే మెగా వేలంలో ముంబై హార్దిక్ పాండ్యను రిలీజ్ చేస్తుందని, రోహిత్ శర్మను అట్టిపెట్టుకుంటుందని ఆ అభిమాని చెప్పుకోచాడు. ముంబై కెప్టెన్సీ మార్పు జరిగినప్పటి నుంచి పాండ్యకు ఫ్యాన్స్ నుంచి పెద్దగా మద్దతు లభించడం లేదు. రోహిత్ శర్మను కాదని పాండ్యకు పగ్గాలు అప్పగించడంపై ఉన్న అసంతృప్తి, ప్రతి ఓటమితో రెట్టింపు అవుతోంది. బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడంలో పాండ్యా విఫలమవుతున్నాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎంఐ బుల్లి ఫ్యాన్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
MI would have won the game if Pandya was not the captain. 240 runs with Bumrah, Boult and Santner is not acceptable. pic.twitter.com/QXlprHer7I
— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 (@ImHydro45) April 12, 2026
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!