Shubman Gill about GT vs DC Match: తమ బ్యాటింగ్ చాలా యావరేజ్‌గా ఉందని, వచ్చే మ్యాచ్‌కు బలంగా సిద్దమై పునరాగమనం చేస్తామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. డబుల్ హ్యాట్రిక్ లాంటి అద్భుతాలు జరిగితే తప్ప.. 89 పరుగుల స్కోరును కాపాడుకోలేం అన్నాడు. తమకు ప్లేఆఫ్స్‌కు అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయని, 5-6 మ్యాచ్‌లు గెలిచి నాకౌట్‌కు చేరుకుంటామని గిల్ ధీమా వ్యక్తం చేశాడు.ఢిల్లీ బౌలర్ల దెబ్బకు గుజరాత్ 17.3 ఓవర్లలో కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయింది. ఢిల్లీ 8.5 ఓవర్లలో 4 వికెట్లకు 92 పరుగులు చేసి గెలిచింది.
Also Read: Rishabh Pant: ఐపీఎల్‌లో రిషబ్ పంత్ అరుదైన ఘనత!
మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ… ‘మా బ్యాటింగ్ చాలా యావరేజ్‌గా ఉంది. ఈ పరాజయాన్ని మరిచి ముందుకు సాగాలి. వచ్చే మ్యాచ్‌కు బలంగా సిద్ధమై.. పునరాగమనం చేస్తాం. వికెట్ బాగానే ఉంది. కొన్ని అవుట్‌లను చూస్తే.. పిచ్ కారణంగానే వికెట్స్ కోల్పోలేదని తెలుస్తోంది. పేలవమైన షాట్స్ ఆడి వికెట్ సమర్పించుకున్నాం. 89 పరుగులు స్వల్ప లక్ష్యం. డబుల్ హ్యాట్రిక్ లాంటి అద్భుతాలు జరిగితే తప్ప.. ప్రత్యర్థిని 89 పరుగులు చేయకుండా అడ్డుకోలేం. సీజన్ సగం మాత్రమే ముగిసింది. మేం మూడు మ్యాచ్‌లు గెలిచాం. గతంలో మాదిరిగానే వచ్చే 7 మ్యాచ్‌లలో 5-6 గెలిస్తేప్లేఆఫ్స్‌కు చేరుకోవచ్చు’ అని అన్నాడు.