ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. విశాఖ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ జట్లు తలపడనున్నాయి. ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో రెండింటిలో గెలుపొందింది. అదే ఉత్సాహంతో ఈ మ్యాచ్ లో కూడా గెలువాలనే కసితో ఉంది. మరోవైపు.. ఆడిన రెండు మ్యాచ్ ల్లో రెండింటిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లోనైనా విజయం సాధించాలని కోరుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో పృథ్వీ షా రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
చెన్నై ప్లేయింగ్ ఎలెవన్:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే, ముస్తాఫిజుర్, పతిరణ.
ఢిల్లీ ప్లేయింగ్ ఎలెవన్:
డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిషబ్ పంత్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, ఇషాంత్ శర్మ, అన్రిచ్ నార్ట్జె, ఖలీల్ అహ్మద్, ముకేశ్.