శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ చెలరేగిపోయాడు. 27 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84 పరుగులు చేశాడు. కొడితే బౌండరీ.. లేకపోతే సిక్సర్ అన్నట్లు జేక్ ఇన్నింగ్స్ సాగింది. ఫ్రేజర్ క్రీజులో ఉన్నంతసేపు ఢిల్లీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ల్యూక్ వుడ్‌ను మాత్రమే కాకుండా.. యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రాను సైతం అతడు వదలలేదు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఫ్రేజర్‌కు ‘ప్లేయర్…