Rishabh Pant React on DC Win vs GT: రసిక్‌దర్ సలామ్‌ను తాము నమ్మాలనుకున్నాం అని, ఆ ప్లాన్ వర్కౌట్ అయిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. అన్రిచ్ నోర్జ్ కఠిన సమయం ఎదుర్కొంటున్నాడని, అందుకే అతడికి బౌలింగ్ ఇవ్వకుండా రసిక్‌తో బౌలింగ్ వేయించాలని మ్యాచ్ మధ్యలోనే నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. తన బ్యాటింగ్ పట్ల చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. మ్యాచ్‌లో తాను సాధించే తొలి సిక్సర్ తనపై తనకు మరింత విశ్వాసాన్ని ఇస్తుందని పంత్ చెప్పుకొచ్చాడు. బుధవారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
గుజరాత్ టైటాన్స్‌పై రిషబ్ పంత్ చెలరేగాడు. 43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 88 రన్స్ చేశాడు. 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచిన ఢిల్లీని అక్షర్ పటేల్‌తో కలిసి పంత్ ఆదుకున్నాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన పంత్‌కు ‘ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న అనంతరం ఢిల్లీ కెప్టెన్ పంత్ మాట్లాడుతూ… ‘అన్రిచ్ నోర్జ్ కఠిన సమయం ఎదుర్కొంటున్నాడు. అందుకే 19వ ఓవర్‌ను రసిక్‌తో బౌలింగ్ చేయించాం. టీ20 మ్యాచ్ అంటేనే ఒక ఫన్నీ గేమ్. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. విజయంపై నమ్మకంగా ఉండలేం’ అని అన్నాడు.
Also Read: Magnus Carlsen: తాగి గేమ్ ఆడా.. ఓసారి ప్యాంట్లో మూత్రం పోసుకున్నా: కార్ల్‌సన్
‘ఛేజింగ్‌లో 14-15 ఓవర్ల తర్వాత బంతి చక్కగా వస్తోంది. కాబట్టి మేము రసిక్‌ను నమ్మలనుకున్నాము. మాములుగా మ్యాచ్‌లో బాగా బౌలింగ్ చేసే వారిని ఎల్లప్పుడూ నమ్మాలి. ఇది కెప్టెన్ దర్మం. రసిక్ ప్లాన్ వర్కౌట్ అయింది. చాలా సంతోషంగా ఉంది. మేం 44/3 స్కోరుతో ఉన్నప్పుడు పోరాడాలని, స్పిన్నర్లపై దాడికి దిగాలని నిర్ణయించుకున్నాం. మైదానంలో బరిలోకి దిగిన ప్రతిరోజు మంచి అనుభూతి పొందుతున్నాను. మ్యాచ్‌లో ప్రతి గంట చాలా కీలకం. మైదానంలో ఉండటాన్ని ఇష్టపడుతున్నాను. నేను 100 శాతం ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటా. కానీ కొన్నిసార్లు సమయం పడుతుంది. మ్యాచ్‌లో సాధించే తొలి సిక్సర్‌తో నాకు నమ్మకం పెరుగుతుంది’ అని పంత్ చెప్పుకొచ్చాడు.