David Warner Runs For Aadhar Card: కరోనా మహమ్మారి సమయంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చేసిన సందడి అంతాఇంతా కాదు. తెలుగు, హిందీ సినిమా పాటలకు రీల్స్ చేస్తూ అందరిని అలరించాడు. ట్రెండ్‌కు తగ్గట్టుగా హీరోలను అనుకరిస్తూ.. చేసే ఫన్నీ వీడియోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీమంతుడు, అలా వైకుంఠపురంలో, పుష్ప, ఆర్ఆర్ఆర్, డీజే టిల్లు తదితర సినిమాల రీల్స్ ద్వారా అతడు చాలా ఫేమస్ అయ్యాడు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన దేవ్ భాయ్.. ఈ రీల్స్‌తో తెలుగు వారికి మరింత దగ్గరయ్యాడు. తాజాగా వార్నర్‌కు సంబందించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా అరుణ్‌జైట్లీ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో హోస్ట్ మాట్లాడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ షేర్ చేసిన వీడియోలో వార్నర్ హిందీలో మాట్లాడటం విశేషం. వీడియోలో హోస్ట్ ఇచ్చిన అని ఆఫర్‌లను తిరస్కరించిన వార్నర్.. ఉచిత ఆధార్ కార్డ్ అనగానే పోదాం పదా అంటూ పరుగులు తీశాడు. సినిమాకు వెళ్దామని హోస్ట్ అడగ్గా.. రాలేనని వార్నర్ చెప్పాడు. ఫ్రీ భోజనం అని చెప్పినా.. వద్దన్నాడు. ‘అక్కడ ఆధార్ కార్డు ఉచితంగా ఇస్తున్నారు’ అని అనగానే.. ‘చలో చలో ’ అంటూ హోస్ట్‌ను ఎత్తుకుని వార్నర్ పరుగెత్తాడు.
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాను హెచ్చరించిన అంబానీ ఫ్యామిలీ.. ముంబై గెలవకపోతే..!
ఈ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. నెట్టింట దూసుకుపోతోంది. వీడియో చూసిన అందరూ తెగ నవ్వుకుంటున్నారు. భారత్ అంటే తనకు ఎంత ప్రేమో డేవిడ్ వార్నర్ పలు మార్లు చెప్పిన విషయం తెలిసిందే. తాను ఇండియన్ సిటిజన్ షిప్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఫన్నీగా పేర్కొన్నాడు. హైదరాబాద్ నగంరంలో దేవ్ భాయ్ ఆటోలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వార్నర్ టైటిల్ అందించాడు. ప్రస్తుతం ఢిల్లీకి ఆడుతున్న అతడు.. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. నేడు గుజరాత్‌తో జరగనున్న మ్యాచ్‌కూ అందుబాటులో ఉండకపోవచ్చు.
Finallyyyyyy, Warner now has a _______? 👀🤣 pic.twitter.com/gDoCtT62eA
— Delhi Capitals (@DelhiCapitals) April 23, 2024