Bhuvneshwar Kumar Record: దూసుకెళ్తున్న స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్.. జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్!
- భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత
- టీ20 క్రికెట్లో 350 వికెట్ల మైలురాయి
- జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhuvneshwar Kumar Surpasses Jasprit Bumrah in T20 Wickets: టీమిండియా సీనియర్ పేసర్, స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత అందుకున్నాడు. భారత్ తరఫున పురుషుల టీ20 క్రికెట్లో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగిన భువీ 3 వికెట్స్ పడగొట్టడంతో ఈ రికార్డు అతడి ఖాతాలో చేరింది. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా రికార్డును భువనేశ్వర్ బద్దలు కొట్టాడు.
టీ20 క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అగ్రస్థానంలో నిలిచాడు. యూజీ 391 వికెట్లు పడగొట్టి టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. తన లెగ్ స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తూ.. మ్యాచ్‌లను మలుపుతిప్పడంలో చహల్ ప్రత్యేక నైపుణ్యం చూపించాడు. యూజీ తర్వాతి స్థానంలో భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. ప్రస్తుతం 350 వికెట్లతో ఉన్న భువీ.. త్వరలోనే ఈ జాబితాలో మరింత పైకి చేరే అవకాశం ఉంది. మూడో స్థానంలో జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. అతడు 347 వికెట్లు సాధించి టీ20ల్లో అత్యంత ప్రభావవంతమైన పేసర్లలో ఒకడిగా నిలిచాడు. పీయూష్ చావ్లా 327 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐదో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ 317 వికెట్లతో కొనసాగుతున్నాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
టీ20లలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు:
# 391 – యుజ్వేంద్ర చహల్
# 350 – భువనేశ్వర్ కుమార్
# 347 – జస్ప్రీత్ బుమ్రా
# 327 – పీయూష్ చావ్లా
# 317 – రవిచంద్రన్ అశ్విన్
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..