ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్‌గా భువీ రెకార్డుల్లోకెక్కాడు. సోమవారం (ఏప్రిల్ 7) వాంఖడే మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ వికెట్ తీయడం ద్వారా భువీ ఖాతాలో ఈ రికార్డు చేరింది. భువనేశ్వర్ 179 ఐపీఎల్ మ్యాచ్‌లలో 184 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో రికార్డును బద్దలు కొట్టాడు. మొన్నటివరకు…