Arshdeep Singh-Siraj: మహమ్మద్ సిరాజ్ అంత కాకపోయినా.. ఏదో అలా బౌలింగ్ చేస్తున్నా!
- ఎంఐపై పీబీకేఎస్ సూపర్ విక్టరీ
- అర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన
- నాకు మెంటల్‌గా స్పష్టత వచ్చింది
- భిన్నమైన వేరియేషన్‌తో బంతిని విసిరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అద్భుత ప్రదర్శనతో సూపర్ విక్టరీ సొంతం చేసుకుంది. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పీబీకేఎస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 22 రన్స్ మాత్రమే ఇచ్చి మూడు వికెట్స్ పడగొట్టాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న అర్ష్‌దీప్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో తన బౌలింగ్ మెరుగుపడటానికి మెంటల్ క్లారిటీ ఎంత ముఖ్యమో వివరించాడు. కోచ్ రికీ పాంటింగ్‌తో జరిగిన సంభాషణ తనకు చాలా హెల్ప్ అయిందని వెల్లడించాడు.
‘నాకు చాలా సంతోషంగా ఉంది. ట్రైనింగ్ సెషన్లో కోచ్ రికీ పాంటింగ్‌తో మాట్లాడిన తర్వాతే నాకు మంచి ఫీలింగ్ వచ్చింది. ఆ సమయంలో నా బౌలింగ్‌పై కాస్త అసంతృప్తిగా ఉన్నాను. అనుకొన్నట్లుగా బౌలింగ్ చేయలేకపోయా. ఇదే విషయాన్ని ఆయనకు చెప్పా. టెక్నికల్‌గా ఏమీ చెప్పలేదు. మానసికంగా ఎలా ఫ్రెష్‌గా ఉండాలో, ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలని సూచించాడు. 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అదే స్థాయిని ఎప్పుడూ కొనసాగించడం సులభం కాదని చెప్పారు. బేసిక్స్‌కి కట్టుబడి, ఆటను ఆస్వాదించాలని సలహాలు ఇచ్చారు తర్వాత నాకు మెంటల్‌గా స్పష్టత వచ్చింది. నిన్న ప్రాక్టీస్‌లో కూడా బాగా బౌలింగ్ చేశాను. అప్పుడు బంతి బాగా వస్తోందని అనిపించింది. ఈరోజు ఫలితం మీ ముందే ఉంది’ అని అర్ష్‌దీప్ చెప్పాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ర్యాన్ రికెల్టన్ వికెట్ గురించి మాట్లాడుతూ.. ‘ఆ వాబుల్-సీమ్ డెలివరీపై నేను చాలా కాలంగా పని చేస్తున్నాను. మహమ్మద్ సిరాజ్ ఆ డెలివరీతో చాలా వికెట్లు తీయడం చూశాను. భిన్నమైన వేరియేషన్‌తో బంతిని విసిరా. రికెల్టన్ను ఔట్ చేసిన బంతి చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇంకా నేను నేర్చుకుంటున్నాను. సిరాజ్ అంత కాకపోయినా.. ఏదో అలా బౌలింగ్ చేస్తున్నా. ఎలా అవుట్ చేశానన్నది ముఖ్యం కాదు.. టీ20లో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం ముఖ్యం’ అని అన్నాడు.
Also Read: Shreyas Iyer: ఫాలోయింగ్ పెరుగుతోంది, ఇక మనల్ని ఎవడ్రా ఆపేది.. శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
డెత్ ఓవర్లలో తన ప్లాన్ గురించి వివరించిన అర్ష్‌దీప్.. ‘వైడ్ యార్కర్లు నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాను. క్రీజులో కుదురుకున్న బ్యాటర్లకు వారి బలమైన ఏరియాల్లో బంతులు వేయకుండా ప్లాన్ చేస్తాను. కొత్త బ్యాటర్ ఉంటే స్టంప్స్‌ను టార్గెట్ చేస్తాను. బ్యాటర్‌కు ముందే మన ప్లాన్ మార్చడం చాలా ముఖ్యం’ అని చెప్పాడు. ప్రేక్షకుల మద్దతుపై కూడా అర్ష్‌దీప్ స్పందిస్తూ.. ‘ఇక్కడ అభిమానుల సపోర్ట్ అద్భుతంగా ఉంది. సోషల్ మీడియాలో నేను చేసే రీల్స్ వల్ల చాలా మంది నన్ను గుర్తిస్తున్నారు. నాకు కూడా రీల్స్ చేయడం ఇష్టం. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. త్వరలో మరిన్ని రీల్స్ వస్తాయి’ అంటూ నవ్వులు పూయించాడు.
తాజావార్తలు
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Meloni-Trump: ట్రంప్‌తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
-
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
-
Food Inflation 2026: వంటగది బడ్జెట్‌కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
-
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
ట్రెండింగ్
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!