Shreyas Iyer: ఫాలోయింగ్ పెరుగుతోంది, ఇక మనల్ని ఎవడ్రా ఆపేది.. శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతోన్న పీబీకేఎస్
- పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో పంజాబ్ కింగ్స్
- పీబీకేఎస్ విజయాలపై శ్రేయస్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer Says Hard to Stop Punjab Kings Now: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఓటమనేదే లేదు. నాలుగు విజయాలు అందుకోగా.. ఓ మ్యాచ్ రద్దయింది. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన పీబీకేఎస్.. మరో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ముంబైపై ఘన విజయం అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ జట్టు ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో జట్టు ఆడుతున్న తీరు అద్భుతంగా ఉందని, ఇదే మోమెంటమ్ కొనసాగించాలని చూస్తున్నామని తెలిపాడు. ఇటీవలి మ్యాచ్‌లలో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వచ్చి తమకు మద్దతు ఇస్తున్నారని, రోజురోజుకు తమకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోందని, ఇక తమను ఆపడం కష్టమే అని శ్రేయస్ నవ్వుతూ చెప్పాడు.
‘మేము టోర్నీలో ముందుకు వెళ్లే విషయంలో చాలా నమ్మకంగా, ఆశావహంగా ఉన్నాం. ఇప్పటివరకు మేము ఆడుతున్న విధానం అద్భుతంగా ఉంది. ప్రతి మ్యాచ్ మాకు చాలా కీలకం. జట్టుగా, యూనిట్‌గా మేము కలిసి కట్టుగా రాణిస్తున్నాం. ఈరోజు పూర్తి స్థాయి విజయం సాధించడం ఆనందంగా ఉంది. యువ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ గత సీజన్‌తో పోలిస్తే చాలా మెచ్యూరిటీ చూపిస్తున్నాడు. అప్పట్లో పవర్‌ప్లేలో దూకుడుగా ఆడేవాడు. ఇప్పుడు మ్యాచ్‌ను ఫినిష్ చేసే స్థాయికి ఎదిగాడు. యువ ఆటగాళ్లు బాధ్యత తీసుకుని మ్యాచ్ గెలిపించడం చాలా సంతోషంగా ఉంది. ప్రభ్‌సిమ్రన్ గొప్ప టాలెంట్ ఆటగాడు’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Arshdeep Singh History: ఐపీఎల్‌లో అర్ష్‌దీప్ సింగ్ ‘సెంచరీ’.. ఏకైక బౌలర్‌గా అరుదైన రికార్డు!
‘ముంబై ఇండియన్స్ ఎక్కువగా రన్స్ చేయకపోవడానికి నా క్యాచ్ (నవ్వుతూ) కీలకం అనిపించింది. నిజంగా చెప్పాలంటే మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ లాగే పవర్‌ప్లే తర్వాత బౌండరీలను నియంత్రించడంపై దృష్టి పెట్టాం. ముందే ఆలోచించకుండా ప్రస్తుతానికి అనుగుణంగా ఆడటమే మా ప్లాన్. మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే అనే విషయంపై ప్రత్యేకంగా ఆలోచించలేదు. ఇప్పటివరకు టాస్ గెలుస్తూ వస్తున్నాను. అయినప్పటికీ మాకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. ప్రతి ఆటగాడు తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు’ అని శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు.
‘ప్రతి మ్యాచ్‌తో మేము మెరుగుపడుతున్నాం. ప్రత్యర్థిపై కాకుండా ఆటపై దృష్టి పెట్టాలి. ఇదే మా విజయాలకు అసలు రహస్యం. ఇదే విధానం కొనసాగితే మాకు విజయాలు వస్తూనే ఉంటాయి’ అని శ్రేయాస్ ధీమా వ్యక్తం చేశాడు. అభిమానుల మద్దతుపై కూడా అయ్యర్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘ఇటీవలి మ్యాచ్‌లలో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వచ్చి మాకు మద్దతు ఇస్తున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. వారి ప్రేమ, మద్దతు మాకు మరింత ఉత్సాహం ఇస్తోంది. ఇదే ఊపు కొనసాగిస్తాం. టోర్నీలో ముందుకు దూసుకెళతాం’ అని పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. పంజాబ్ ఈ సీజన్‌లో సమిష్టిగా రాణిస్తూ టైటిల్ రేసులో బలంగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!