Ananya Birla-RCB: అన్ని కోట్లు ఉన్నా ఆ సింప్లిసిటీ ఏందయ్యా.. ఆర్‌సీబీ ఓనర్ అనన్య అదుర్స్!
- ఆర్‌సీబీ నయా ఓనర్ అనన్య బిర్లా
- సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న అనన్య
- అన్ని కోట్లు ఉన్నా ఆ సింప్లిసిటీ ఏందయ్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రాంచైజీ ఒకటి. ఆర్‌సీబీ ఇటీవల చేతులు మారిన విషయం తెలిసిందే. ఆర్‌సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్ సంస్థలు కైవసం చేసుకున్నాయి. రూ.16,706 కోట్ల ధరకు ఈ కన్సార్టియం కొనుగోలు చేసింది. ప్రస్తుతం డియాజియో ఆధీనంలో ఉన్న ఆర్‌సీబీ.. ఐపీఎల్ 2026 అనంతరం కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోనుంది. ఐపీఎల్ 2026 మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతుండగా.. ఆర్‌సీబీ నయా ఓనర్ అనన్య బిర్లా సింప్లిసిటీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అనన్య బిర్లా తన సింప్లిసిటీతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. వేల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ.. ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాధారణ మహిళగా ఉన్నారు. సుమారు రూ.1770 కోట్ల నెట్ వర్త్ ఉన్న అనన్య.. ఇటీవల ఒక ఈవెంట్‌లో ఎంతో సింపుల్‌గా కనిపించారు. ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వెనుక ప్రశాంతంగా కూర్చుని, ఎలాంటి హడావిడి లేకుండా ఉండటం నెటిజన్లను ఆకట్టుకుంది. ఆమెలో ఆత్మవిశ్వాసం, వినయం ప్రత్యేకంగా నిలిచాయి. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఉండటం అనన్య వ్యక్తిత్వాన్ని మరింత గొప్పగా చూపిస్తోంది. ఆత్మవిశ్వాసం, సాదాసీదా జీవన శైలి ఆమెను ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతోంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కెరీర్‌లో సచిన్ సో స్పెషల్.. దెబ్బకు దశ తిరిగింది!
ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగలం బిర్లా కుమార్తనే అనన్య బిర్లా. 1994లో ముంబైలో జన్మించిన అనన్య.. అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో చదివారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. శక్తివంతమైన వ్యాపార కుటుంబానికి చెందినప్పటికీ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో అనన్య సక్సెస్ అయ్యారు. 17 ఏళ్ల వయసులోనే ‘స్వతంత్ర మైక్రోఫిన్’ అనే సంస్థను స్థాపించారు. గ్రామీణ మహిళలకు చిన్న మొత్తాల్లో రుణాలు అందిస్తూ ఆర్థిక స్వావలంబనకు దోహదపడే ఈ సంస్థ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అనంతరం డిజిటల్, కన్స్యూమర్ రంగాల్లో ‘ఇకై అసాయి’ బ్రాండ్‌ను అనన్య ప్రారంభించారు.
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!