Ajinkya Rahane Captaincy: కేకేఆర్ కెప్టెన్సీ వదిలేయాలనిపించలేదా?.. ఆజింక్య రహానే ఆసక్తికర సమాధానం ఇదే!
- లీగ్ దశ నుంచే నిష్క్రమించిన కేకేఆర్
- పట్టికలో ఏడవ స్థానంలో కేకేఆర్
- సారథ్యంలో తేలిపోయిన ఆజింక్య రహానే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajinkya Rahane on KKR Captaincy: ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఆశించిన స్థాయిలో రాణించలేదు. అజింక్య రహానే నాయకత్వంలో బరిలోకి దిగిన కేకేఆర్.. లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న కోల్‌కతా.. చివర్లో పుంజుకున్నప్పటికీ ప్లేఆఫ్స్ బెర్త్ అందుకోలేకపోయింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో ఆరు విజయాలతో 13 పాయింట్స్ ఖాతాలో వేసుకుని.. పట్టికలో ఏడవ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా? అనే ప్రశ్నకు జింక్స్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన అజింక్య రహానే.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వెనక్కి తగ్గడం తన స్వభావం కాదని స్పష్టం చేశాడు. ‘నేను కెరీర్ మొత్తం మంచి అటిట్యూడ్‌తో క్రికెట్ ఆడాను. నాకు క్యారెక్టర్ చాలా ముఖ్యం. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడే నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. నేను ఎప్పుడూ వెనక్కి తగ్గే వ్యక్తిని కాదు. వరుసగా ఐదు, ఆరు మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు ఒత్తిడి సహజం. కానీ ఆ సమయంలో గతం లేదా భవిష్యత్తు గురించి కాకుండా ప్రస్తుతం ఏం చేయాలో దానిపైనే దృష్టి పెట్టాలి’ అని రహానే చెప్పాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఈ సీజన్లో కేకేఆర్ తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఐదు ఓటములు చవిచూసి పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి చేరింది. అయితే తర్వాతి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 40 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో అజింక్య రహానే వ్యక్తిగతంగా కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 14 మ్యాచ్‌ల్లో 335 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా అతడి స్ట్రైక్‌రేట్ టోర్నీలోనే తక్కువగా నమోదైంది. అయితే జింక్స్ తన కెప్టెన్సీపై వచ్చిన విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు. ‘మ్యాచ్‌లు ఓడిపోతే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. కానీ ఆటలో ఎప్పుడైనా తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఎప్పుడూ వెనక్కి తగ్గను. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే ఆలోచన ఒక్కసారి కూడా రాలేదు’ అని స్పష్టం చేశాడు.
2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 36 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత టీమిండియాకు చారిత్రాత్మక విజయాన్ని అందించిన రహానే.. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసని మరోసారి చూపించాడు. ఈ సీజన్లో కేకేఆర్‌కు గాయాల సమస్య కూడా పెద్ద దెబ్బగా మారింది. హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ వంటి కీలక బౌలర్లు గాయపడగా.. బీసీసీఐ ఆదేశాలతో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను కూడా జట్టు విడుదల చేయాల్సి వచ్చింది. దీంతో భారత యువ బౌలర్లపై నమ్మకం ఉంచినట్లు రహానే తెలిపాడు. ‘మా భారత బౌలర్లకు సమయం ఇవ్వాలని అనుకున్నాను. ఒత్తిడిలో వారు బాగా రాణిస్తారనే నమ్మకం నాకు ఉంది’ అని చెప్పాడు.
అవకాశాలను యువ ఆటగాళ్లు అనుకూల్ రాయ్, కార్తిక్ త్యాగీ అద్భుతంగా వినియోగించుకున్నారు. కార్తిక్ ఈ సీజన్లో 18 వికెట్లు తీసి భారత బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అనుకూల్ 12 ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు పడగొట్టడమే కాకుండా.. రెండు విజయవంతమైన చేజ్ల్లో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరికీ ఇది కేవలం ఆరంభమేనని, భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకునే సామర్థ్యం ఉందని రహానే ప్రశంసించాడు.
తాజావార్తలు
-
Mega DSC: ‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్!
-
Fake DAP Fertilizer Scam: నకిలీ డీఏపీ ఎరువుల కలకలం.. ప్రభుత్వం సీరియస్.. విచారణకు ఆదేశాలు.!
-
Team India: ఆ చెత్త ప్లేయర్స్ ఎందుకు.. వెంటనే టీమిండియాలో నుంచి తీసేయండి!
-
Rao Bahadur OTT: ఐదు భాషల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘రావ్ బహదూర్’.. త్వరలోనే స్ట్రీమింగ్
-
Flipkart Freedom Sale 2026: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ డేట్ ఫిక్స్.. iPhone 17, Galaxy S25పై భారీ డీల్స్
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!