Abhishek Sharma Unwanted Record: మొదటి బ్యాటర్‌గా.. అభిషేక్ శర్మ చెత్త రికార్డు!
- గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న అభిషేక్ శర్మ
- తొలి బంతికే అభిషేక్ డకౌట్
- అభిషేక్ శర్మ చెత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ కోల్పోయి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి పరుగులు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించగా.. రవి బిష్ణోయ్ అద్భుత క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. దీంతో అభిషేక్ ఖాతాలో చెత్త రికార్డులు చేరాయి.
ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇన్నింగ్స్ తొలి బంతికే అవుటైన రెండో బ్యాటర్‌గా అభిషేక్ శర్మ రికార్డుల్లో నిలిచాడు. అంతకుముందు ఈ చెత్త రికార్డు గబ్బర్ శిఖర్ ధావన్ పేరుపై ఉంది. 2018 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-1లో ధావన్ తొలి బంతికే అవుటై ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత అభిషేక్ ఆ చెత్త రికార్డును పునరావృతం చేశాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Ishan Kishan Big Decision: ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి దూరం!
2026 క్యాలెండర్ ఇయర్ ప్రారంభమైనప్పటి నుంచి అభిషేక్ శర్మ టీ20ల్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ ఏడాది ఆడిన 18 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా ఏడుసార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. గతంలో కూపర్ కన్నోలి 17 ఇన్నింగ్స్‌ల్లో 4 సార్లు డకౌట్ అయిన రికార్డును అభిషేక్ అధిగమించి.. అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా నిలిచాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకున్నాడు. రోహిత్ శర్మ (2018లో 6 సార్లు), సంజూ శాంసన్ (2024లో 6 సార్లు), గురుకీరత్ సింగ్ (2103లో 5 సార్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
తాజావార్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
-
Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
-
Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
-
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!