Ishan Kishan Big Decision: ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి దూరం!
- ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం
- ఇక నుంచి వికెట్ కీపింగ్‌కు దూరం
- కమ్యూనికేషన్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH Captain Ishan Kishan to Stop Wicketkeeping in IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను ఎస్‌ఆర్‌హెచ్ తరఫున కీపింగ్ చేయనని స్పష్టం చేశాడు. కెప్టెన్‌గా ఫీల్డ్‌లో ఉండి బౌలర్లతో నేరుగా మాట్లాడటం, ప్రణాళికలు చర్చించడం మంచి ఫలితాలను ఇచ్చిందని.. వికెట్ కీపింగ్ చేస్తే కొన్నిసార్లు కమ్యూనికేషన్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పాడు. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఉన్నంత కాలం తాను కీపింగ్‌కు దూరంగా ఉంటానని ఇషాన్ చెప్పుకొచ్చాడు. ఎస్‌ఆర్‌హెచ్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా ఐపీఎల్ 2026లో ఆడని విషయం తెలిసిందే. తాత్కాలిక సారథిగా ఇషాన్ బాధ్యతలు చేపట్టాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం అందుకుంది. ఈ మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఈ విజయంతో చాలా సంతోషంగా ఉంది. పాయింట్ల పట్టికలో మరో 2 పాయింట్లు చేరాయి. మా బౌలర్లు అద్భుతం. వారి నుంచి ఏం ఆశించామో అదే ఇచ్చారు. బౌలర్లు స్వేచ్ఛగా ఆడి ప్రణాళికలను అద్భుతంగా అమలు చేశారు. ఈ విజయం పూర్తి క్రెడిట్ బౌలర్లకే చెందుతుంది. యువ బౌలర్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాలని కోరుకున్నారు. కష్టపడి ప్రాక్టీస్ చేశారు. ఫీల్డింగ్, మా బౌలింగ్ కోచ్ వరుణ్ అరుణ్ తో కలిసి పనిచేశారు. కోచ్‌లతో నిరంతరం మాట్లాడుతూ తమ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించారు’ అని చెప్పాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Praful Hinge-Vaibhav: హాట్సాఫ్ ప్రఫుల్ హింగే.. చెప్పినట్టే మొదటి బంతికే ‘బుడ్డోడి’ వికెట్ తీశావ్!
‘హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్నప్పుడు యువకులకు అవకాశం ఇవ్వాలని మేము అనుకున్నాం. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో కూడా వారు బాగా ఆడారు. మా నిర్ణయం సరైనదే. మంచి ఫలితం వచ్చింది. మా బ్యాటింగ్ యూనిట్ ఫామ్ చూస్తే.. ప్రతి మ్యాచ్‌లో 200కి పైగా పరుగులు చేస్తున్నాం. కాబట్టి ఆ విషయంలో నమ్మకం ఉంది. అభిషేక్ శర్మది దూకుడు ఆట శైలి. కొన్నిసార్లు త్వరగా ఔట్ అవుతాడు. అయినా అతనికి స్వేచ్ఛ ఇవ్వాలి. ఒకసారి ఫామ్‌లోకి వస్తే మ్యాచ్‌ను పూర్తిగా మార్చేస్తాడు. అభిషేక్ ఆడితే జట్టు స్కోర్ 260-270 వెళుతుంది. అందుకే అతడిపై ఒత్తిడి పెట్టం. ఈ మ్యాచ్‌లో ఔట్ అయినా వచ్చే మ్యాచ్‌లో మరింత ఉత్సాహంగా ఆడతాడు’ అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?