Abhishek Sharma History: అప్పుడే దిగ్గజం క్రిస్ గేల్ రికార్డు బ్రేక్.. టీ20 క్రికెట్‌లో ‘ఒకే ఒక్కడు’ అభిషేక్ శర్మ!
- సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్
- వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డు బ్రేక్
- టీ20 క్రికెట్‌లో 'ఒకే ఒక్కడు' అభిషేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma Breaks Chris Gayle Record: టీ20 క్రికెట్ అంటేనే బంతిని బాదడం. బ్యాటర్లు తమ దూకుడు, భారీ షాట్లతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. పొట్టి ఫార్మాట్‌లో 50, 100 పరుగులు చేయడమే గొప్ప విషయం. అలాంటిది 130కు పైగా స్కోర్లు నమోదు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో దూకుడు, ప్రతిభ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ జాబితాలో కొద్ది మంది స్టార్ బ్యాటర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు. అందులో యువ ఆటగాడు అభిషేక్ శర్మ ఉండడం, అందులోనూ టాప్‌లో ఉండడం విశేషం.
టీ20 ఫార్మాట్‌లో అత్యధికసార్లు 130+ స్కోర్లు నమోదు చేసిన బ్యాటర్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ (135 నాటౌట్; 68 బంతుల్లో 10×4, 10×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు టీ20ల్లో నాలుగు సార్లు 130కి పైగా పరుగులు చేశాడు. అభి దూకుడైన బ్యాటింగ్, పవర్ హిట్టింగ్, టైమింగ్.. ఇలా అన్ని కలిసి అతడిని ప్రత్యేక ఆటగాడిగా నిలబెట్టాయి. ఐపీఎల్ 2026లో అతడి ఫామ్ చూస్తే ఈ సంఖ్య పెరగడం ఖాయం అనిపిస్తోంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
టీ20 ఫార్మాట్‌లో అత్యధికసార్లు 130+ స్కోర్లు నమోదు చేసిన బ్యాటర్‌గా ఇప్పటివరకు యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ మూడు సార్లు 130+ స్కోర్లు నమోదు చేశాడు. తాజాగా ఇన్నింగ్స్‌తో గేల్ రికార్డును అభిషేక్ శర్మ బ్రేక్ చేశాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా మూడు సార్లు 130+ స్కోర్ చేశాడు. ఫించ్ తన ఆగ్రెసివ్ స్ట్రోక్ ప్లేకు ప్రసిద్ధి కాగా.. గేల్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో టీ20లకు కొత్త నిర్వచనం ఇచ్చాడు. ఇప్పుడు అభిషేక్ డేంజరస్ హిట్టర్‌గా బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఐపీఎల్ కారణంగా భవిష్యత్తులో ఈ జాబితాలో మరిన్ని పేర్లు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!