రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 సీజన్‌ను శుభారంభంతో ప్రారంభించింది. తమ తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలను నమోదు చేసి, అభిమానులను ఆకట్టుకుంది. మొదటి మ్యాచ్‌లో మూడు సార్లు ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పై విజయం సాధించగా, రెండవ మ్యాచ్‌లో ఐదు సార్లు ట్రోఫీ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పై సూపర్ విక్టరీ సాధించింది. ఈ విజయాలతో ఆర్సీబీ జట్టు ప్రస్తుత సీజన్‌లో మెరుగైన సమతుల్యత (బ్యాలెన్స్)ను చూపుతోందని మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డారు.
Read Also: Venkaiah Naidu: ఇందిరాగాంధీ తనకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడంతో ఎన్నికల సమయాలలో మార్పులు
రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ అద్భుతంగా రాణిస్తోంది. ముఖ్యంగా చెపాక్ స్టేడియంలో 17 ఏళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించడం జట్టుకు గర్వకారణంగా మారింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ఆర్సీబీ వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన ‘AB డివిలియర్స్ 360’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, “గత సీజన్లతో పోలిస్తే ఈ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాలెన్స్ పది రెట్లు మెరుగుపడింది” అని వ్యాఖ్యానించారు. గత ఏడాది ఆర్సీబీ జట్టుకు బ్యాలెన్స్ లేకపోయిందని.. ఈసారి ఆ లోటు తీర్చబడిందని తెలిపారు. “బౌలర్లు, బ్యాట్స్‌మెన్, ఫీల్డర్లను మాత్రమే కాకుండా.. మొత్తం జట్టు సరైన బ్యాలెన్స్ ఉండటం ఎంతో అవసరం. ఈసారి ఆర్సీబీ జట్టు చాలా స్ట్రాంగ్ గా ఉంది” అని అన్నారు.
Read Also: Rythu Bandhu : తెలంగాణలో రైతులకు శుభవార్త..
భువనేశ్వర్ కుమార్ గురించి మాట్లాడుతూ.. “భువీ మొదటి మ్యాచ్‌లో జట్టులో లేకపోయినా, రెండవ మ్యాచ్‌లో ఆడారు. జట్టుకు అవసరమైన బ్యాలెన్స్ అంటే ఇదే. ప్లేయర్లను రొటేట్ చేసేందుకు, ప్రత్యర్థి బలాబలాలను అంచనా వేసేలా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంటుంది” అని వివరించారు. కాగా.. ఐపీఎల్ 2025లో బెంగళూరు జట్టుకి ఇది అత్యుత్తమ ఆరంభంగా పేర్కొనవచ్చు. కేవలం ఫలితాల పరంగా కాకుండా, జట్టులో కూడా ఇది చాలా ముఖ్యమైన మార్పుగా చెబుతున్నారు. మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను వారి సొంత మైదానంలో ఓడించగా.. రెండవ మ్యాచ్‌లో చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించడం గొప్ప విజయంగా నిలిచింది.