వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ కోసం మెగవేలం జరగనున్న విషయం తెలిసిందే. అయితే గత 14 సీజన్ ల నుండి 8 జట్లు పోటీ పడుతున్న ఈ లీగ్ లో ఐపీఎల్ 2022 నుండి మరో రెండు జట్లు కలిసి మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ నెలలో ఈ రెండు కొత్త జట్ల వేలం కూడా జరిగిపోయింది. అయితే ఈ కొత్త జట్ల రాకతో ఐపీఎల్ 15 వ సీజన్ కోసం మెగా వేలం నిర్వహిస్తుంది బీసీసీఐ. ఇక ఇప్పటికే పాత జట్లు అన్ని తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను.. అలాగే వేలంలోకి వదిలే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసాయి. దాంతో ఈ నెల చివర్లో కానీ.. జనవరిలో కానీ ఆటగాళ్ల వేలం ఉంటుంది అని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 12, 13 తేదీలలో ఈ ఐపీఎల్ మెగా వేలం బెంగళూరు వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కానీ దీని పై ఇంకా బీసీసీఐ నుండి అధికారిక ప్రకటన రాలేదు.