IPL Highest Team Scores: ఐపీఎల్ చరిత్రలో భారీ స్కోర్ల వర్షం.. ఎస్ఆర్హెచ్దే హవా, టాప్-10 లిస్ట్ ఇదే!
- ఐపీఎల్ అంటేనే భారీ సిక్సర్లు, పరుగుల వర్షం
- ఇటీవలి కాలంలో రికార్డు స్థాయి స్కోర్స్
- ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్హెచ్దే హవా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Highest Team Totals IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే అభిమానులకు గుర్తుకొచ్చేది భారీ సిక్సర్లు, పరుగుల వర్షం. ముఖ్యంగా ఇటీవల సీజన్లలో బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడుతూ రికార్డు స్థాయి స్కోర్లను నమోదు చేస్తున్నారు. టీ20 ఫార్మాట్లో 250కి పైగా స్కోర్లు సాధారణంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోర్లు నమోదు చేసిన జట్ల టాప్-10 జాబితా ఆసక్తికరంగా నిలిచింది. ఈ లిస్ట్ ఏంటో చూద్దాం.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోర్ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అగ్రస్థానంలో నిలిచింది. 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ఎస్ఆర్హెచ్ 287/3 స్కోర్ చేసింది. రెండో స్థానంలో ఎస్ఆర్హెచ్ టీమే నిలవడం విశేషం. 2025లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)పై 286/6 స్కోర్ నమోదు చేసింది. మూడో స్థానంలో కూడా సన్‌రైజర్స్ జట్టే ఉంది. ముంబై ఇండియన్స్‌పై 2024లో 277/6 స్కోర్‌ను ఎస్ఆర్హెచ్ చేసింది. టాప్ 3లో మొత్తం ఎస్ఆర్హెచ్ ఉండడం విశేషం. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్, హెన్రిచ్ క్లాసెస్ వంటి హిట్టర్లు జట్టులో ఉండడంతో సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేస్తోంది.
Also Read
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
- IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
- CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
- IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్‌పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
నాలుగో స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఉంది. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేకేఆర్ 272/7 స్కోర్ చేసింది. ఐదో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 266/7 రన్స్ చేసింది. ఇలా టాప్-5లోనే ఎస్ఆర్హెచ్ నాలుగు సార్లు ఉండడం ఆ జట్టు బ్యాటింగ్ శక్తిని చూపిస్తుంది. ఆరవ స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2013లో పూణే వారియర్స్ ఇండియాపై చేసిన 263/5 స్కోర్ ఉంది. ఇది చాలా కాలం పాటు ఐపీఎల్లో అత్యధిక స్కోర్‌గా కొనసాగింది.
Also Read: IPL 2026 Records: మెయిడెన్ ఓవర్ల మాయాజాలం.. ఐపీఎల్లో మొత్తం మనోళ్లదే హవా!
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోర్ చేసిన జాబితాలో పంజాబ్ కింగ్స్ ఏడో స్థానంలో ఉంది. 2024లో కేకేఆర్‌పై పంజాబ్ 262/2 స్కోర్ చేసింది. ఎనిమిదో స్థానంలో ఆర్సీబీ ఉండగా.. 2024లో ఎస్ఆర్హెచ్పై 262/7 స్కోర్ నమోదు చేసింది. తొమ్మిదో స్థానంలో కేకేఆర్ 2024లో పంజాబ్‌పై 261/6 స్కోర్ చేసింది. పదో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ 2024లో ముంబై ఇండియన్స్‌పై 257/4 స్కోర్‌తో నిలిచింది. ఈ గణాంకాలు చూస్తే.. ఐపీఎల్లో బ్యాటింగ్ ప్రభావం ప్రతి సీజన్‌కు పెరుగుతోంది. 2024 సీజన్లోనే ఎక్కువగా ఈ భారీ స్కోర్లు నమోదవ్వడం విశేషం. భవిష్యత్తులో 300 పరుగుల మైలురాయి కూడా సాధ్యమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
US Cuba Drone Tension: ఇరాన్‌కు తీసిపోని క్యూబా.. అమెరికా దాడి చేస్తే భారీ రక్తపాతమే!
-
Hyderabad Horror: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్‌పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!