నేడు ఐపీఎల్-2022లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ సీజన్‌లో రాజస్తాన్ అద్భుతంగా రాణిస్తుండగా.. ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై అన్నింట్లోనూ ఓటమి చెందింది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో రాజస్తాన్ రాయల్స్ రెండో స్థానంలో ఉండగా… ముంబై ఇండియన్స్ చివరి స్థానంలో ఉంది.
ఈ మ్యాచ్‌లో అయినా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని ముంబై చూస్తోంది. అయితే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభం లభించింది. ఆ జట్టు ఓపెనర్లు జోస్ బట్లర్ (10), దేవ్‌దత్ పడిక్కల్ (15) ఆచితూచి ఆడుతున్నారు. డేనియల్ సామ్స్ వేసిన 3వ ఓవర్‌లో పడిక్కల్ హ్యాట్రిక్ ఫోర్లతో అలరించాడు. అయితే.. హ్యాట్రిక్ ఫోర్లు బాది జోరుమీదున్నట్లు కనిపించిన పడిక్కల్ (15 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 15).. హృతిక్ షోకీన్ బౌలింగ్‌లో పోలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
రాజస్థాన్ 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ముంబై పేసర్ మెరిడిత్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి అశ్విన్ (21) వికెట్ పడగొట్టాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో బట్లర్, అశ్విన్ మినహాయించి ఎవ్వరూ రాణించలేదు. ముంబై బౌలర్లలో మెరిడిత్, హృతిక్ షోకీన్ తలో 2 వికెట్లు పడగొట్టగా డేనియల్ సామ్స్, కుమార్ కార్తికేయ చెరో వికెట్ దక్కించుకున్నారు.