ఐపీఎల్-2022 మెగా వేలానికి ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ -2022 మెగావేలానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. అలాగే ఈ ఏడాది కొత్తగా వస్తున్న లక్నో, అహ్మదాబాద్ జట్లకు బీసీసీఐ ఫార్మల్ క్లియరెన్స్ కూడా ఇచ్చిందని ఆయన ప్రకటించారు. ఆయా ఫ్రాంఛైజీలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను జారీ చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రెండు బిడ్‌లను గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదించిందని… దీనికి సంబంధించిన ఎల్‌ఐవోను త్వరలోనే జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను జారీ చేయడం ద్వారా ఐపీఎల్ మెగా వేలానికి ముందే ఈ రెండు జట్లు తమ ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉందని బ్రిజేష్ పటేల్ తెలిపారు. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్‌కు కొత్త స్పాన్సర్ రానుంది. చైనా కంపెనీ వివోకు బదులు టాటా సంస్థను ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా నియమించింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. అటు లక్నో జట్టుకు కేఎల్ రాహుల్, అహ్మదాబాద్ జట్టుకు హార్థిక్ పాండ్యా కెప్టెన్సీ వహిస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!