Tamarind Seeds:మనం గతంలో వేసవి సెలవులు వచ్చాయంటే మహిళలంతా కలిసి అష్టా చెమ్మా, చింత పిక్కల గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేసేవారు. ఇక ఇంటి పట్టునే ఉండే మహిళలు మధ్యాహ్నం వేళ చింతకాయ గింజలతో రకరకాల ఆటలు ఆడేవారు. అయితే ఇప్పుడు ఆ కాలం లేదు.. మారిపోయింది. దీంతో.. ఇప్పుడు పిక్కలు లేని చింత పండు వచ్చేయడంతో ఆ గేమ్స్‌కు బ్రేక్ పడింది. చెప్పాలంటే.. మనకేమైతే దూరమౌతున్నాయో వాటినే కొన్నింటినీ మార్కెట్ చేసుకుంటున్నాయి పలు ఆన్ లైన్ సంస్థలు. మనం ఎంతగా బిజీ అయిపోయామంటే.. మన బిజీ లైఫ్‌ను, బద్ధకాన్ని క్యాష్ చేసుకుంటున్న సదరు సంస్థలు. ఇక పండుగ సమయాల్లో అరిసెలు, బూరెలు, చక్రాలు, మామిడి ఆకులు, తోరణాలు అమ్ముతున్నాయి. అంతేకాదండోయ్ చివరకు అరిటాకులు, పిడకలు కూడా నెట్టింట్లో అమ్మకానికి పెడుతున్నాయి. ఆ బాటలోనే.. ఇప్పుండు తాజాగా చింత పిక్కలు పెట్టి ఆశ్చర్యంలో ముంచెత్తింది ఓ ఆన్ లైన్ సంస్థ.
Read also:Bike Stunts in Malakpet:నగరంలో పోకిరీల ఆగడాలు.. బైక్ పై స్టంట్లు చేస్తూ ఇబ్బందులు
మనం ఇంట్లో అమ్మ ఏదైనా పులుసు కూర వండితే.. ఒకటో రెండో చింత గింజలు వస్తే ఏం చేస్తుందీ. తినలేం కాబట్టి వాటిని పారేస్తుంది. ఇప్పుడు అవి పారేయొద్దని అమ్మకు చెప్పండి . ఎందుకు అంటారా? ఎందుకంటే ఇప్పుడు ఆన్ లైన్ సంస్థలు వాటిని కూడా అమ్మేస్తున్నాయన్న మాటా..చింతకాయల్ని, పండును అమ్మకానికి పెడితే ఆశ్చర్యపోనక్కర్లేదు. దీన్నే.. ఏకంగా చింత పిక్కలను అమ్మకానికి పెట్టింది ఆన్ లైన్ వ్యాపార సంస్థ ఫ్లిఫ్ కార్ట్. అయితే.. వీటిని మామూలు, కాల్చిన చింత గింజలను అమ్ముతోంది. ఈ చింతపిక్కల ధర చూస్తే కూడా ఆశ్చర్యపోక మానరు. దీనిని ఒక్కో ప్యాకెట్ ధర రూ. 110గా నిర్ణయించింది. ఇందులో ఆ ప్యాకెట్‌లో ఎన్ని ఉంటాయో తెలుసా 100 చింతపిక్కలు మాత్రమే ఉంటాయన్నమాట.. అంటే ఒక్కో చింత పిక్క ధర ఒక్క రూపాయికి పై మాటే. అంతూకాదండోయ్ ఈ చింతపక్కిలు కొనుగోలు చేసిన వారు కూడా ఉన్నారంటే మన భారతదేశం ఎంత ఎదిపోయిందో చూడండి. కొనుగోలు చేయడమే కాదండోయ్.. వీటిని కొని రేటింగ్ కూడా ఇచ్చారంటే ఎంత ఉదారహృదయం.
Read also: Liquor Policy Case: కవితపై ఈడీ ప్రశ్నల వర్షం.. ఢిల్లీలో పరిణామాలపై కేసీఆర్ ఆరా
రేటింగ్స్, రివ్యూస్ కూడా ఇచ్చారంటే చూడండి వీటికి ఎంత డిమాండ్ ఉందో. గింజలకు క్యాష్ అన్ డెలివరీ కూడా చేయనుంది ఆ సంస్థ. ఇక చింత పిక్కలను అమ్మకానికి పెట్టడం చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.. ఇదేందయ్యా ఇది మేము ఎప్పుడూ చూడలేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ… చింత గింజలను కూడా వ్యాపారం చేస్తారని తెలిస్తే చిన్నప్పడి నుండే దాచేకునే వాళ్లమని కొందరూ కామెంట్లు పెడుతున్నారు. అంటే.. మొత్తానికి వ్యాపారం చేసేందుకు ఏదీ అడ్డుకాదని నిరూపించిందీ సదరు సంస్థ. చింతపిక్కల విత్తనాల్లో కూడా పోషక విలువలు మెండుగా ఉండటంతో వాటిని కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే.. వీటిని వేయించుకుని తింటారని సమాచారం. ఇక.. ప్రస్తుతం ఈ చింత గింజల వ్యాపారానికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు.
Top Headlines @1PM: టాప్ న్యూస్