Brett Lee: క్రికెట్‌ను ఇష్టపడే ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దానిని ఆదాయ వనరులుగా భారీ స్థాయిలో తీర్చిదిద్దడం వెనుక భారత జట్టుది కీలక పాత్ర పోషించిందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ పేర్కొన్నారు. టీమిండియా క్రికెట్ వాణిజ్య కేంద్రంగా మారడమే కాదు, ఆట పట్ల అసమానమైన అంకిత భావాన్ని కూడా సంపాదించుకుందన్నాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్‌తో బ్రెట్ లీ మాట్లాడుతూ.. తన వాదనకు బలం చేకూరేలా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. భారత్‌తో పోలిస్తే ఆస్ట్రేలియాలో పరిమితులు ఉంటాయని తెలిపాడు.
Read Also: Kumari 22F: సుక్కూ భార్య కొత్త నిర్మాణ సంస్థలో కుమారి 21F సీక్వెల్
అయితే, ఆస్ట్రేలియాలో ఎంత ప్రచారం చేసినా భారీ స్థాయిలో క్రికెట్‌కు ఫ్యాన్స్ ఉండరని బ్రెట్‌లీ చెప్పుకొచ్చారు. ఇక భారత్‌లో అయితే ఆ సంఖ్య కోట్లలో ఉందన్నారు. 150 కోట్ల మంది భారతీయుల్లో క్రికెట్ ఇష్టపడని వ్యక్తులను నేను ఓ 10 మందిని కలిసి ఉంటాను.. ఇప్పుడు టీ20లను వీక్షించే వారి సంఖ్య కూడా చాలా వరకు పెరిగిపోయింది. పేరెంట్స్ ధోరణి కాస్త స్లోగా ఉంటే.. పిల్లలు మాత్రం త్వరగా విషయాలు జరిగిపోవాలని కోరుకుంటున్నారు. అందుకే, టీ20 ఫార్మాట్‌కు ఇంత ఆదరణ పెరిగిందని ఈ మాజీ పేసర్ పేర్కొన్నాడు. బ్రెజిల్ లాంటి దేశాల్లో ఫుట్‌బాల్ ఆటకు ముగింపు పలికే రోజు వస్తుందేమో కానీ.. భారత్‌లో క్రికెట్‌కు ఆ పరిస్థితి ఏ రోజు రాదు.. భారతీయుల వల్లే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కొనసాగుతుంది.. అక్కడి అభిమానులకు ఉన్న ఇంట్రెస్ట్ తోనే ఇది సాధ్యమైందని బ్రెట్‌లీ వ్యాఖ్యానించాడు.
