సుకుమార్, ఒకపక్క పాన్ ఇండియా లెవెల్ సినిమాలు చేస్తూనే, మరోపక్క తన శిష్యులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో సుకుమార్ రైటింగ్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్‌లయ్యాయి.
అయితే, ఇప్పుడు సుకుమార్ కుటుంబం నుంచి మరో నిర్మాణ సంస్థ తెరమీదకు రాబోతోంది. సుకుమార్ భార్య తబిత కీలకంగా వ్యవహరించబోతున్న ఈ నిర్మాణ సంస్థ పేరు కూడా తబితా సుకుమార్ ఫిలింస్ అని తెలుస్తోంది.
Also Read: Venkatesh: గురూజీ… వెంకీ మామతో ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా ?
ఇక ఈ సంస్థ నుంచి మొదటి సినిమాగా, గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన ‘కుమారి 21ఎఫ్’ సినిమాకి సీక్వెల్‌గా ‘కుమారి 22ఎఫ్’ అనే సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అదే డైరెక్టర్‌తో, నటీనటులలో మార్పులతో ఈ సినిమా రూపొందించబోతున్నట్లుగా సమాచారం. 2015లో రిలీజ్ అయిన ‘కుమారి 21ఎఫ్’ సినిమా అప్పట్లోనే ఒక ప్రోగ్రెసివ్ సినిమాగా యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ఈ నేపథ్యంలో, సుమారు 10 ఏళ్ల తర్వాత వస్తున్న ఆ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్.