దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్.. తొలి సిరీస్ కోసం టీమిండియా ఆరాటం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా.. ఆ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది.. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1 తేడాతో రెండు జట్లు సమానంగా ఉండగా.. ఇవాళ కేప్‌టౌన్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు భారత్-సౌతాఫ్రికా మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడనుండడం భారత్‌కు కలిసివచ్చే అవకాశంగా చెప్పుకోవాలి.. అయితే, కండరాల గాయంతో మూడో టెస్ట్‌కు సిరాజ్ దూరం అయ్యాడు.. సిరాజ్ స్థానంలో ఇషాంత్ శర్మ ఆడే అవకాశం ఉంది. తొలి టెస్ట్ మ్యాచ్‌ను గెలిచి ఊపు మీదున్న టీమిండియాకు.. రెండో టెస్ట్‌లో షాక్ ఇచ్చింది సౌతాఫ్రికా.. అయితే, చివరి టెస్ట్ మ్యాచ్‌లోనైనా సర్వశక్తులు ఒడ్డి అద్భుతాన్ని ఆవిష్కృతం చేయాలన్న పట్టుదలతో ఉంది భారత జట్టు..
Read Also: జనవరి 11, మంగళవారం దినఫలాలు…
Also Read
- Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
- BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
- India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
ప్రస్తుతం సిరీస్ 1-1తో సమం కావడంతో ఇవాళ కేప్‌టౌన్ వేదికగా జరగనున్న మూడో టెస్టుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. నిర్ణాయక మ్యాచ్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడనున్నాయి. దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు టెస్టు సిరీస్ గెలవని భారత్‌కు ఇదే చక్కటి అవకాశంగా విశ్లేషకులు చెబుతున్నారు… దక్షిణాఫ్రికా గడ్డపై తన కెప్టెన్సీలోనే జట్టుకు అపురూప విజయం అందించాలని కోహ్లీ తపన పడుతున్నాడు. అటు రెండో టెస్టులో గెలిచిన జోష్‌లో ఉన్న ఆతిథ్య జట్టు ఈ మ్యాచ్‌లోనూ పట్టు సడలించకూడదని భావిస్తోంది. ఇవాళ ఫైనల్‌గా బరిలోకి దిగే జట్ల వివరాలు పరిశీలిస్తే.. భారత్ నుంచి కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రహానె, రిషబ్ పంత్, శార్దూల్ పటేల్, అశ్విన్, షమి, బుమ్రా, ఇషాంత్ కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉండగా.. దక్షిణాఫ్రికా నుంచి ఎల్గర్ (కెప్టెన్), మార్క్రమ్, పీటర్సన్, డుస్సెన్, బవుమా, వెర్రెనీ, జాన్సెన్, కేశవ్ మహరాజ్, రబాడ, ఒలివియెర్, ఎన్గిడి బరిలోకి దిగే అవకాశం ఉంది.. మరి పేసర్లకు బాగా అనుకూలించే కేప్‌టౌన్‌లో మ్యాచ్ గెలిచేది ఎవరు? తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచి భారత్ సత్తా చాటుతుందా..? సౌతాఫ్రికానే ట్రోఫీని అందుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!