India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs England 2nd ODI: భారత్–ఇంగ్లండ్ మధ్య కార్డిఫ్ వేదికగా జరుగుతోన్న రెండో వన్డేకు ముందు టీమ్ ఇండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి ఎంపిక చేశారు. టాస్ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
ఇక, టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. పిచ్‌పై సమానంగా గడ్డి ఉండటంతో కొత్త బంతితో బౌలర్లకు అనుకూల పరిస్థితులు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డాడు. తొలి వన్డేలో చివరి వరకు పోరాడినా విజయం సాధించలేకపోయామని, ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని జట్టు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. అలాగే తమ తుది జట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు.
Also Read
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
ఇక భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తాము కూడా టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని చెప్పారు. తొలి వన్డేలో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఫాస్ట్ బౌలర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారని, అదే జోరును కార్డిఫ్‌లోనూ కొనసాగించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్డిఫ్ మైదానంలో భారత జట్టుకు మంచి రికార్డు ఉందని, ఇప్పటివరకు ఇక్కడ జరిగిన నాలుగు వన్డేల్లో మూడు విజయాలు సాధించిన విషయం తమకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోందన్నారు.
మరోవైపు.. కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్‌కు ఇది కీలక అవకాశం కానుంది. చాలా కాలం తర్వాత తుది జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ప్రతిభను నిరూపించుకోవాలని భావిస్తున్నాడు. బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా అతడే నిర్వహించనున్నాడు. టాస్ సమయంలో, రాహుల్‌ను జట్టులోకి తీసుకోకపోవడానికి గల కారణాన్ని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశారు. అతను అనారోగ్యంతో ఉన్నాడని తెలిపారు.
భారత తుది జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!