India vs Pakistan: భారత్‌తో మ్యాచ్ ఆడుతుందా.. ఐసీసీతో పాకిస్తాన్ చర్చలు..

Ind Vs Pak

Ind Vs Pak

India vs Pakistan: T20 ప్రపంచ కప్‌ వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా క్రికెట్ ప్రపంచం దృష్టి ఇప్పుడు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌పై నెలకొంది. అయితే, ఈ మ్యాచ్ జరుగుతుందా.? లేదా? అనే సందేహాలు ఇంకా ఉన్నాయి. బంగ్లాదేశ్ టోర్నీ బహిష్కరణకు మద్దతుగా భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. ఈ మేరకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా భారత్‌తో మ్యాచ్ ఆడబోవడం లేదని చెప్పారు. అయితే, ఐసీసీ నుంచి చర్యలు, ఆర్థిక నష్టం, శ్రీలంక ఆడాలని కోరడం చూస్తే పాకిస్తాన్ తప్పకుండా తన నిర్ణయం నుంచి యూటర్న్ తీసుకుంటుందని తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

Read Also: FUNKY Trailer: అనుదీప్ మార్క్ కామెడీతో.. విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ట్రైలర్!

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధికారికంగా ICCకి ‘‘ఫోర్స్ మజురే’’ అనే నిబంధనను ఉపయోగిస్తూ.. అత్యవసర పరిస్థితుల్లో ఒక మ్యా్చ్‌ను తిరస్కరిస్తూ లేఖ రాసింది. అయితే, ఈ పరిస్థితుల్లో ఐసీసీ కలుగజేసుకుని, భారత్ తో జరిగే ఒక్క మ్యాచ్‌కే ఈ నిబంధన వర్తింపచేయడం ఏమిటని ప్రశ్నించింది. మిగతా మ్యాచ్‌లు ఆడుతామని ఎలా చెబుతారు?? అని అడగటంతో పాటు ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చే ప్రయత్నం చేశారా.. ప్రత్యామ్నాయ మార్గాలు ప్రయత్నించారా? అని ప్రశ్నించింది.

ఇదే కాకుండా ఫోర్స్ మజురే తప్పుగా వాడితే పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డుపై చర్యలు, నష్టపరిహారం కేసులు పడొచ్చని ఐసీసీ స్పష్టంగా హెచ్చరించింది. ఇదే సమయంలో చర్చలకు ఐసీసీ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. బ్యాక్ డోర్‌ చర్చలు ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా కొలంబో వేదికగా షెడ్యూల్ అయిన ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌ ఆడాల్సిందిగా శ్రీలంక బోర్డు పాకిస్తాన్‌ను కోరింది. శ్రీలంక, పాకిస్తాన్‌కు మధ్య రాజకీయ, క్రీడా సంబంధాలు బాగున్నాయి. ఒక వేళ ఈ మ్యాచ్ రద్దు అయితే, తమ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందని శ్రీలంక వెల్లడించింది.