India vs Pakistan : ఆసియా కప్‌లో రసవత్తర పోరు.. దుబాయ్‌లో భారత్-పాక్ ఢీ
ఆసియా కప్‌లో ఇవాళ రసవత్తర పోరు జరగనుంది. అసలు సిసలైన మ్యాచ్‌కి సమయం ఆసన్నమైనది.. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్… యుఏఈ వేదికగా తలపడనున్నాయి… దాయాది జట్ల మధ్య రసవత్తర పోరు జరిగితే ఆ మ్యాచ్.. ఓ చిన్న యుద్ధంలాగే ఉంటుంది. ఎప్పుడూ క్రికెట్ చూడనివారు కూడా.. ఈ మ్యాచ్ చూసి తీరుతుంటారు.. అభిమానుల కోలాహోలం మధ్య ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే రాజకీయ కారణాల వల్ల ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగనప్పటికీ.. ఐసీసీ టోర్నీ, ఆసియా కప్ లాంటి టోర్నమెంట్లలో ఇరుజట్లు తలపడుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో ఓటమి బదులు తీర్చుకోవాలని భారత్ వ్యూహాలు రచిస్తోంది. వెస్టిండీస్, జింబాబ్వేలో… సిరీస్‌లు గెలుపొంది మంచి ఊపుమీదుంది టీమిండియా. అదే జోరును ఆసియా కప్‌లోనూ కొనసాగించాలని భారత క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Read Also: TS constable exam 2022: నేడు కానిస్టేబుల్ రాతపరీక్ష… ఇవి నిబంధనలు మరవొద్దు..
Also Read
- Mumbai Indians: ఓటమిలోనూ వరల్డ్ రికార్డ్.. టీ20 క్రికెట్ చరిత్రలో తొలి జట్టుగా ముంబై ఇండియన్స్
- Ruturaj Gaikwad: ముంబైని ముంచిన చెన్నై వ్యూహం.. సీఎస్‌కే గెలుపు రహస్యం చెప్పిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
- Hardik Pandya: ప్లేఆఫ్స్ నుంచి ముంబై ఔట్.. వైఫల్యాన్ని నిజాయితీ ఒప్పుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్‌డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు చరమగీతం..?
ఆసియా కప్‌లో భారత్ రికార్డు అద్భుతంగా ఉంటే… పాకిస్తాన్ జట్టు ట్రాక్ రికార్డు అంతంత మాత్రంగానే ఉంది. రెండు సార్లు మాత్రమే ఆ జట్టు ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఆసియా కప్‌ను అత్యధిక సార్లు గెలుచుకున్న భారత్… మరోసారి ముద్దాడాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా గెలవాలని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఆకాంక్షించారు. టీమిండియా రన్ మిషిన్ విరాట్ కోహ్లీ… ఈ మ్యాచ్‌లో ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. జట్టు సమతూకంతో ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హర్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజాలతో బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, అశ్విన్, చాహల్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్‌లు ఉన్నారు.
ఇక, విరాట్ కోహ్లీ, యజువేంద్ర చాహల్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లను మైదానంలో కలిసి కాసేపు మాట్లాడాడు అఫ్రిదీ. ముఖ్యంగా పంత్-అఫ్రిదీ కలిసి ఒకరిపై మరొకరు జోకులు వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.. పంత్‌తో కలిసి జోకులు పేల్చాడు అఫ్రిదీ. పంత్ మాదిరిగా ఒంటి చేత్తో సిక్సర్లు బాదాలని తాను అనుకున్నట్లు అతడితో అంటాడు అఫ్రిదీ. దీంతో ఇద్దరూ కాసేపు నవ్వుకుంటారు. ఈ వీడియోలు.. మ్యాచ్ ముందే వైరల్‌గా మారిపోయాయి..
తాజావార్తలు
-
OTT Movies : ఈ వారం ఓటీటీ క్లాష్‌లో ఎవరు టాప్‌లో నిలుస్తారు?
-
Donald Trump: 14-సూత్రాల ప్లాన్‌తో ఇరాన్.. ఆమోదయోగ్యం కాదని ట్రంప్ తిరస్కరణ.. మళ్లీ యుద్ధం చెలరేగుతుందా?
-
Dubbing Movies : అర్థంకాని టైటిల్స్ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు
-
India Ship: హార్మూజ్ జలసంధి దాటిన భారత్‌కు వస్తున్న LPG క్యారియర్.. మే 13న విశాఖకు!
-
Mumbai Indians: ఓటమిలోనూ వరల్డ్ రికార్డ్.. టీ20 క్రికెట్ చరిత్రలో తొలి జట్టుగా ముంబై ఇండియన్స్
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!