ఇండియా వర్సెస్ పాక్ హైటెన్షన్ మ్యాచ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ జట్ల మధ్య మ్యాచ్ కోసం… యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తుందో… ఆ క్షణం వచ్చేసింది. దాయాదుల మధ్య సమరానికి సమయం ఆసన్నమైంది. రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే.. ఆ రెండు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే ఆసక్తి చూపుతారు. కానీ… ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుంటే… క్రికెట్ రుచి తెలియని దేశాలు సైతం టీవీలకు అతుక్కుపోయి చూస్తాయి. మిగతా దేశాలతో మ్యాచ్ ఆడితే గెలుపోటములను సమానంగా స్వీకరిస్తారు. కానీ.. దాయాది దేశంతో మ్యాచ్ అంటే.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాల్సిందే. ఓ టీమ్ ఓడినా… యావత్ దేశం పరువు గంగలో కలిసినట్టుగా ఫీల్ అవుతారు. అదే… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యచ్.
రెండేళ్ల తర్వాత ఇండియా పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్. చివరగా జూన్ 16, 2019 లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో ఇండియా, పాక్ మధ్య మ్యాచ్ జరిగింది. క్వార్టర్ ఫైనల్ లో ఇండియా… పాక్‌ను చిత్తుగా ఓడించింది. 89 రన్స్ తేడాతో… పాక్ పై ఇండియా విజయం సాధించింది. ఆ మ్యాచ్ తర్వాత… ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ దాయాది దేశాలు తలపడబోతున్నాయి.
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
ఈనెల 24వ తేదీ కోసం యావత్ క్రీడా లోకం ఎదురుచూస్తోంది…. ఈ సూపర్ సండే కోసం క్రికెట్ లవర్స్ తెగ తొందరపడుతున్నారు… !! ఎందుకు… ఏమిటి… ఏం జరగనుంది అనుకుంటున్నారా..! దుబాయ్ వేదికగా దాయాదుల మధ్య సమరం జరగబోతోంది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా.. ఇండియా పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
పాకిస్తాన్ ఇప్పటి వరకు వరల్డ్ కప్ మ్యాచ్‌లలో ఇండియాని ఓడించింది లేదు. వరల్డ్ కప్‌లో ఇండియా పాక్ 7 సార్లు తలపడగా… పాక్ ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు. ఏడు మ్యాచ్‌ల్లోనూ ఇండియాదే విజయం. టీ20 వరల్డ్ లో భాగంగా ఇప్పటివరకు రెండు దేశాలు 5 సార్లు హెడ్ టు హెడ్ తలపడగా… ఇండియా 4-0 తో ఆధిక్యం లో ఉంది. మరో మ్యాచ్ రద్దైంది. ఇప్పుడు మరోసారి ఈ రెండు దేశాలు తలపడనున్నాయి.
ఈనెల 24న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికంగా జరగనున్న ఇండియా పాక్ మ్యచ్ టికెట్లను ఐసీసీ 4వ తేదీ నుంచి అందుబాటులో ఉంచింది. సైట్ లో ఉంచిన గంటలోపే టికెట్లన్నీ ఐపోయాయి అంటేనే తెలుస్తోంది… ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారో.
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!