Jagtial: జగిత్యాలలో విషజ్వరాల కలకలం.. రెండు రోజుల్లో ఇద్దరు చిన్నారులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagtial: జగిత్యాల జిల్లా రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో విషజ్వరాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ జ్వరాల బారిన పడి ఇద్దరు చిన్న పిల్లలు మృతి చెందడంతో విషాదాన్ని ఛాయలు అలుముకున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే పక్కపక్క ఇళ్లలో ఉండే ఇద్దరు ఆరేళ్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో శోకసంద్రం అలుముకుంది. స్థానికుల కథనం ప్రకారం, ఒకే తరగతి (యూకేజీ) చదువుతూ, నిత్యం కలిసి మెలిసి ఆడుకునే స్నేహితులు హరిస్మిత (6), వరుణ్ తేజ (6)లు విషజ్వరాల బారిన పడ్డారు. రెండు రోజుల క్రితం వరుణ్ తేజ మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న ఉదయం హరిస్మిత కన్నుమూసింది. ఈ ఇద్దరు చిన్నారులు విషజ్వరాల వల్ల కలిగిన తీవ్ర అస్వస్థతతోనే మరణించినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ వరుస మరణాలతో తక్షణమే స్పందించిన ఆరోగ్య శాఖ, పొరండ్లలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. గ్రామంలో విషజ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య సిబ్బంది ఈ రోజు నుంచి ప్రతి ఇంటికీ తిరుగుతూ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహించిన సర్వేలో గ్రామంలో సుమారు 20 మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామస్తులు ఎవరూ అధైర్యపడకూడదని, ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచించారు. జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కొద్దిగా కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి లేదా గ్రామంలోని ప్రత్యేక వైద్య శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు.
Also Read
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
- Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
- Virat Kohli: "ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది".. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
- CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
తాజావార్తలు
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
-
Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
-
Kishan Reddy : ఓట్ల చోరీ చేయం.. మనసులే గెలుస్తాం
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?