Love O Love OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీలోకి ‘లవ్ ఓ లవ్’.. ధనుష్ మేనల్లుడు సినిమా ఎక్కడ చూడాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love O Love OTT Release: ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లే ప్రేమికుల కథలు తెరపై కొత్తేమీ కావు. అయితే ప్రేమ పేరుతో అతిగా ఖర్చు, అప్పులు, ఉద్యోగం కోల్పోవడం, చివరకు ప్రేమనే ప్రశ్నించే పరిస్థితి వస్తే? అలాంటి ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ‘లవ్ ఓ లవ్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వస్తుండటం విశేషం.
ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిలవుక్కు ఎన్మేల్ ఎన్నడి కోబం’ (NEEK) సినిమాతో హీరోగా పరిచయమైన పవిష్ నారాయణ్, తాజాగా ‘లవ్ ఓ లవ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు మాగేష్ రాజేంద్రన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ 2026 జూలై 10న తమిళం, తెలుగులో థియేటర్లలో విడుదలైంది. యువతను ఆకట్టుకునే కథాంశంతో వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ లభించినప్పటికీ, ఇప్పుడు ఓటీటీలో యూత్ ని మరో సారి అలరించేందుకు సిద్ధమవుతోంది.
Also Read
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో 'సునీల్'.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ మూవీ 2026 జూలై 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని దర్శకుడు సెల్వరాఘవన్ తన సోషల్ మీడియా ఖాతా ఆఫీషియల్ గా ప్రకటించారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా సినిమా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో చూడలేకపోయిన వారికి ఇది మంచి అవకాశం కానుంది.
సినిమా కథ
ఈ స్టోరీ రఘువరన్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అవంతికను ప్రేమించే అతను, ఆమెను సంతోషంగా ఉంచాలనే ఆలోచనతో తన ఆర్థిక స్థోమతకు మించి ఖర్చు చేస్తూ వెళ్తాడు. ఖరీదైన బహుమతులు కొనడం, క్రెడిట్ కార్డులు పూర్తిగా వినియోగించడం, భారీ అప్పుల్లో కూరుకుపోవడం, చివరకు ఉద్యోగం కోల్పోవడం వరకు పరిస్థితి దిగజారుతుంది. తన కష్టాలకు ప్రేమికురాలే కారణమని భావించిన రఘువరన్, పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటనల తర్వాత తీసుకునే నిర్ణయాలు కథను ఆసక్తికర మలుపుల్లోకి తీసుకెళ్తాయి.
కథలో కీలకమైన ట్విస్ట్‌గా క్రేజీ గా సాగుతుంది. రఘువరన్ ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడిని అవంతిక కూడా అనుభవించాలని ఒక ఒప్పందం కుదరడంతో, ఇద్దరూ ఒకరి పరిస్థితిని మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రేమ అంటే కేవలం బహుమతులేనా? లేక పరస్పర అవగాహన, బాధ్యత కూడా అవసరమా? అనే ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ సినిమా.
తారాగణం
ఈ మూవీలో పవిష్ నారాయణ్‌కు జోడీగా తెలుగు ఫోక్ డ్యాన్సర్, గాయని నాగ దుర్గ నటించారు. కీలక పాత్రల్లో సెల్వరాఘవన్, కె.ఎస్. రవికుమార్, వనితా విజయ్‌కుమార్, రమ్య, అశ్వత్, ఆదిత్య కతిర్ తదితరులు కనిపిస్తారు. చిత్రానికి సంగీతం ఫాక్సన్ అందించగా, సినిమాటోగ్రఫీని పి.జి. ముత్తయ్య, ఎడిటింగ్‌ను ఎన్.బి. శ్రీకాంత్ నిర్వహించారు. దినేష్ రాజ్, జి. ధనంజయన్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయినా, ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ కు దగ్గరైన కథతో ఓటీటీలో మంచి ఆదరణ పొందుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
- Tags
- Amazon Prime Video
- cinema
తాజావార్తలు
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!