India vs Ireland: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. బీసీసీఐ కీలక నిర్ణయం, కొత్త యుగానికి నాంది!
- భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్
- టీమిండియా క్రికెట్‌లో కీలక మార్పు
- కెప్టెన్‌గా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా క్రికెట్‌లో కీలక మార్పులకు నాంది పలుకుతున్నట్లు తెలుస్తోంది. భారత్-ఐర్లాండ్ మధ్య జూన్‌లో జరగనున్న రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు యువ స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఈ సిరీస్ ద్వారా గిల్‌కు మరింత బాధ్యతలు అప్పగించే దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గిల్ ఇప్పటికే రెండు వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. భారత సెలెక్టర్లు, కోచింగ్ స్టాఫ్ కలిసి శుభ్‌మన్ గిల్‌ను భవిష్యత్ కెప్టెన్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలు రచిస్తున్నారట. ఇప్పటికే రెండు ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న గిల్.. తన కెప్టెన్సీలో జట్టును అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. అతడి నాయకత్వంలో టీమిండియా మంచి ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నారట. ప్రస్తుత టీ20 సారథిగా సూర్యకుమార్ యాదవ్ ఉన్న విషయం తెలిసిందే.
Also Read
- 2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
- RCB Player: యాడ్ షూట్ నుంచి డేటింగ్ వరకు.. ఆ నటితో ఆర్సీబీ ప్లేయర్‌కు పెళ్లి..?
- ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..
- India vs Zimbabwe: మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి.. ఇండియాను ఓడించే ప్లాన్స్ మా దగ్గర ఉన్నాయి: జింబాబ్వే కెప్టెన్
Also Read: Varanasi Update: ఫాస్ట్ ట్రాక్‌లో ‘వారణాసి’ షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా?
రాబోయే టీ20 ప్రపంచ కప్‌లో పాటు 2028 ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం కీలకంగా మారింది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా యువ సారథిని తీర్చిదిద్దాలని బీసీసీఐ భావిస్తోందట. శుభ్‌మన్ గిల్‌కు పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం ద్వారా జట్టును భవిష్యత్తుకు సిద్ధం చేయాలని ప్రయత్నిస్తోంది. మొత్తానికి ఐర్లాండ్ సిరీస్ గిల్ కెరీర్‌లో కీలక మలుపు కావచ్చు. ఈ నిర్ణయం భారత క్రికెట్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2026 అనంతరం అఫ్గానిస్థాన్‌తో భారత్ సిరీస్ ఆడనుంది. ఆపై ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ జరగనుంది.
తాజావార్తలు
-
Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. ‘RX100’ తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
-
Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
-
TPCC Mahesh Goud : రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా రేపు ‘ఛలో లోక్ భవన్’
-
Mamitha Baiju: సౌత్ ఇండియాలో సునామీ.. 3 వారాల్లో 3 భాషల్లో భారీ రికార్డు!
-
Rahul Gandhi: మోడీ ఇంటి దగ్గర నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్‌గాంధీ, ఖర్గే
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!