Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్ స్టార్ పేస్ బౌలర్ మార్క్ వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2015లో ప్రారంభమైన అతని పదకొండేళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ నేటితో ముగిసింది. ముప్పై ఆరు సంవత్సరాల వయసున్న మార్క్ వుడ్ ఇంగ్లండ్ తరఫున టెస్టులు, వన్డేలు, టీ20లు అనే మూడు ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించారు. ఈ ప్రయాణంలో అతను రెండు ప్రపంచకప్‌లను ఒక వన్డే , ఒక టీ20 గెలుచుకున్న ఇంగ్లండ్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నారు.
2015లో న్యూజిలాండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌తో అతను అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు. తన కెరీర్లో మొత్తం 38 టెస్టు మ్యాచ్‌లు ఆడి 119 వికెట్లు పడగొట్టగా, 70 వన్డేల్లో 80 వికెట్లు, 38 టీ20 మ్యాచ్‌లలో 54 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆరవ బౌలర్‌గా ఆయన నిలిచారు.
Also Read
- Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
- AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
- Vijayendra Prasad : ఏప్రిల్ 7 2027న వారణాసి తప్పకుండా రిలీజ్ అవుతుంది
- El Nino Impact : ఎల్‌నినో దెబ్బ.. తెలంగాణలో 23.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం
2019 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో మార్క్ వుడ్ ప్రధాన పాత్ర పోషించారు. స్వదేశంలో జరిగిన ఆ టోర్నమెంట్లో ఆయన 18 వికెట్లు తీసి సత్తా చాటారు. గంటకు 95 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో ఆయన విసిరిన బంతులు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాయి. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గాయపడినప్పటికీ పట్టుదలగా బౌలింగ్ చేశారు. ఆ మ్యాచ్ టై కావడం, సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమం కావడంతో బౌండరీల లెక్కింపు ఆధారంగా ఇంగ్లండ్ మొదటిసారి వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.
ఆ తర్వాత 2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ గెలుచుకోవడంలోనూ ఆయన తన వంతు పాత్ర పోషించారు. ఆ టోర్నమెంట్లో కేవలం 4 మ్యాచ్‌లాడి 9 వికెట్లు తీశారు. అలాగే నాలుగు యాషెస్ సిరీస్‌లలో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2015 యాషెస్ సిరీస్‌లో ట్రెండ్ బ్రిడ్జ్ టెస్టులో ఆయన అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్ విజయంలోనూ, సిరీస్ కైవసం చేసుకోవడంలోనూ కీలక పాత్ర పోషించారు. 2023 యాషెస్ సిరీస్‌లో హెడింగ్లే వేదికగా ఆస్ట్రేలియాపై ఆయన చెలరేగి ఆడిన తీరు ఇంగ్లండ్‌కు పునరాగమనం చేయడానికి మార్గం సుగమం చేసింది.
తన రిటైర్మెంట్ నిర్ణయం గురించి మాట్లాడుతూ… గడిచిన ఏడాది కాలం నా శరీరంపై పడిన భారాన్ని చూస్తే ఈ నిర్ణయం ఆశ్చర్యకరమైనది కాదని, కాంట్రాక్ట్ ముగిసే సమయానికి ఇదే సరైన సమయమని భావించానని తెలిపారు. ప్రతిసారీ గాయాల నుంచి కోలుకుని తిరిగి రావడానికి ప్రయత్నించానని, కానీ ఈసారి తన శరీరం సహకరించలేదని చెప్పారు. ఇంగ్లండ్ దేశం తరఫున ఆడటం తన జీవితంలోనే అత్యంత గొప్ప గౌరవమని, ఇది తన కల అని పేర్కొన్నారు.
మార్క్ వుడ్ కెరీర్‌ను కొనియాడుతూ ఇంగ్లండ్ మెన్స్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ మాట్లాడుతూ.. పెద్ద మ్యాచులలో జట్టు విజయం కోసం ఎంతో ప్రభావం చూపిన ఆటగాడని, యాషెస్ విజయాలు, ప్రపంచకప్‌లు, ప్రేక్షకులను అలరించిన అతని బౌలింగ్ శైలిని చాలా తక్కువ మంది మాత్రమే సాధించగలరని ప్రశంసించారు.
తాజావార్తలు
-
Tragedy: అది ఆత్మహత్య కాదు.. ఫోన్ ఎక్కువగా వాడుతోందని కుమార్తెను గొంతు నులిమి చంపిన కన్నతల్లి..
-
Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
-
Miyapur Land Dispute : మియాపూర్ భూములపై సుప్రీం కీలక తీర్పు.. ప్రభుత్వానికి భారీ ఊరట
-
Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
-
AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?