IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్.. షెడ్యూల్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Australia ODI Series Schedule Details: నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను 2-1తో ఓడించి, ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీని ముద్దాడిన టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సిరీస్‌కు సిద్ధం అవుతోంది. ఈసారి కూడా అదే జోరు కొనసాగించి.. వన్డే సిరీస్‌ని కైవసం చేసుకోవాలని భారత్ చూస్తోంది. అటు.. టెస్ట్ సిరీస్‌లో భారత్ చేతిలో ఓటమి చవిచూసిన ప్రత్యర్థి జట్టు ఆసీస్ సైతం ఈ వన్డే సిరీస్ నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మార్చి 17వ తేదీ నుంచి స్వదేశంలోనే జరగనుంది. అయితే.. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి వన్డే మ్యాచ్‌కు దూరం (ఫ్యామిలీ ఫంక్షన్) కావడంతో.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇండియన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ తల్లి మరణం నేపథ్యంలో దూరం అవ్వడంతో.. అతని స్థానంలో స్టీవ్ స్మిత్ పగ్గాలు చేపట్టనున్నాడు.
Husband Missing: పెళ్లయిన మూడు నెలలకే భర్త అదృశ్యం.. అసలేమైంది?
Also Read
- SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
ఈ వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ మార్చి 17వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్ మార్చి 19వ తేదీన విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇక మార్చి 22వ తేదీన జరగనున్న చివరిదైన మూడో వన్డే మ్యాచ్‌కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక కానుంది. భారత కాలమానం ప్రకారం.. ఈ వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం కానున్నాయి.
India invites Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రికి భారత్ ఆహ్వానం..
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్ (తొలి వన్డేకు కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, శ్రేయస్ అయ్యర్ (వెన్నునొప్పి కారణంగా దూరం)
ఆస్ట్రేలియా జట్టు:
స్టీవ్ స్మిత్(కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!