Husband Missing: పెళ్లయిన మూడు నెలలకే భర్త అదృశ్యం.. అసలేమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Goes Missing After 3 Months Of Marriage In Hyderabad: ఆ జంటకు మూడు నెలల క్రితమే పెళ్లి అయ్యింది. వీరిని డిస్ట్రర్బ్ చేయడానికి గానీ, నెత్తి మీద భారాలు మోపడానికి గానీ.. వీరితో పాటు ఇంట్లో ఎవ్వరూ ఉండటం లేదు. కేవలం ఇద్దరే ఉంటున్నారు. పైగా.. హైదరాబాద్ నగరంలో కాపురం పెట్టారు. అలాంటప్పుడు.. ఈ దంపతులు ఎంత సంతోషంగా ఉండాలి? నచ్చిన ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేయడమే కాదు, హ్యాపీగా తమ దాంపత్య జీవితాన్ని లీడ్ చేయాలి. కానీ.. అందుకు భిన్నంగా ఈ నవ దంపతుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. మొదటి కొన్ని రోజుల వరకు అన్యోన్యంగా ఉన్నారు కానీ, ఆ తర్వాతి నుంచే గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే భర్త తన భార్యకు చెప్పకుండా అదృశ్యమయ్యాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Boora Narsaiah Goud: మోడీ కాదు.. ముందు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి
Also Read
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన సోను అనే యువకుడు కొంతకాలం నుంచి హైదరాబాద్‌లోని యూసుఫ్‌గుడ బస్తీలో ఉంటున్నాడు. ఇతడు ఒక ప్రైవేట్ ఉద్యోగి. మూడు నెలల క్రితం ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న షేక్ రోషిని (24) అనే అమ్మాయితో అతనికి వివాహం అయ్యింది. కట్ చేస్తే.. ఈనెల 5వ తేదీన ఆఫీసుకి వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన సోను, అట్నుంచి అటే మాయమయ్యాడు. సాయంత్రం ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో.. భార్య రోషిని అతనికి ఫోన్ చేసింది. అయితే.. సోను ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో కంగారుపడ్డ రోషిని, తన భర్త కోసం వెతకడం మొదలుపెట్టింది. ఆఫీస్ వాళ్లకు, అతని స్నేహితులకు ఫోన్ చేసి ఆరా తీసింది. కానీ.. ఎక్కడా సోను జాడ కనిపించలేదు. ఏం చేయాలో పాలుపోని రోషిని.. బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.
Rashid Latif: రెస్ట్ ఇన్ పీస్ పాకిస్తాన్ క్రికెట్.. మాజీ క్రికెటర్ సంచలనం
ఈ ఏడాది జనవరిలో తమకు పెళ్లి అయ్యిందని, నెల రోజులుగా తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని రోషిని తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ గొడవల కారణంగా.. తన భర్తకు రెండో పెళ్లి చేయాలని గుంటూరులో ఉంటున్న అతని తల్లిదండ్రులు చూస్తున్నారని తెలిపింది. భర్త కోసం తాను అన్ని ప్రాంతాల్లో వెతికానని, ఎక్కడా అతని జాడ తెలియరాలేదని తెలిపింది. తన అత్తమామల వద్దే తన భర్త ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
-
SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
-
Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!