Virat Kohli – MS Dhoni: భారత జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ రెండు ప్రపంచకప్‌లను అందించడమే కాదు.. ట్యాలెంట్ ఉన్న యంగ్ క్రికెటర్లను ప్రోత్సహించి మెరుగైన రిజల్ట్స్ రాబట్టాడు అని పాక్ మాజీ ప్లేయర్ ఉమర్ అక్మల్ తెలిపారు. సహచరలుకు సపోర్టుగా నిలిచి వారు మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తాడు అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ పేర్కొన్నారు. 2013లో తన సమక్షంలో జరిగిన ఆసక్తికర సంఘటనను అక్మల్ తాజాగా వెల్లడించారు. టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఎంఎస్ ధోనీ ఎంత మద్దతుగా నిలిచాడో తాజాగా అక్మల్ వివరించాడు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
అయితే, పాక్ టీమ్ సభ్యులమైన మేము 2012- 13 సీజన్‌లో భారత పర్యటనకు వెళ్లాము.. ఒక రోజు మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, షోయబ్ మాలిక్, నేను కలిసి డిన్నర్‌కు పోయాం.. ఆ టైంలో ధోనీ దగ్గరకు టీమిండియా మేనేజర్ వచ్చి.. రన్స్ చేయలేక ఇబ్బందులు పడుతున్న విరాట్ కోహ్లీని తప్పించాలని ధోనీకి తెలిపాడు.. అప్పుడు ధోనీ స్పందిస్తూ.. ఫైన్.. నేను కూడా ఇంటికి వెళ్లి ఇప్పటి వరకు ఆరు నెలలు గడిచిపోయింది.. రైనా కెప్టెన్సీ చేస్తాడు.. కోహ్లీతో పాటు నాకు కూడా టికెట్ కొనండని చెప్పాడు.. వెంటనే మేనేజర్.. దయచేసి కోహ్లీని జట్టుతో తీసుకెళ్లండి అని అక్కడి నుంచి వెళ్లిపోయాడని ఉమర్ అక్మల్ ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించారు.
Read Also: Jawan Japan Release: జపాన్‌లో రిలీజ్ కాబోతున్న షారుఖ్ ఖాన్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే..?
కాగా, టీమిండియా మేనేజర్ వెళ్లిన వెంటనే తాను మహేంద్ర సింగ్ ధోనీ వైపు ఆశ్చర్యంగా చూసి అలా ఎందుకు మాట్లాడావని అడిగితే.. దానికి ధోని చెప్పిన సమధానం ఇప్పటికీ మర్చిపోలేనని పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఉమర్ అక్మల్ అన్నాడు. విరాట్ కోహ్లీ మా జట్టులోని అత్యుత్తమ బ్యాటర్.. కేవలం మూడు, నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన ఎలా పక్కన పెడతామని అతడు (ధోనీ) అన్నట్టు అక్మల్ చెప్పుకొచ్చాడు. ధోనీ చెప్పిన సమాధానం విని తాను షాకయ్యాను.. ఒక ఆటగాడికి కెప్టెన్ నుంచి ఇలాంటి సపోర్టు లభిస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదని ఉమర్ అక్మల్ పేర్కొన్నారు.