వరల్డ్ కప్ లో టీమిండియా అన్ని మ్యాచ్‌లు గెలిచింది.. కానీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఓడిపోయాం.. ఆ మ్యాచ్‌లో మనం ఎందుకు ఓడిపోయామాని నేను ఎంక్వైరీ చేశాను అని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఇందిరా గాంధీ పుట్టిన రోజున వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడటం వల్లే భారత జట్టు విఫలమైంది అని ఆయన విమర్శించారు.
వన్డే ప్రపంచ కప్ 2023 చివరి అంకానికి చేరుకుంది. రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో టీమిండియా పోటీ పడుతుంది. 20 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్‌లో తలపడుతున్నాయి.
వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌కు మరోసారి ఓడిపోవడంతో భారత జట్టుపై సర్వాత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియాను భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినంధించారు. భారత ఘన విజయం పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు.
ఆరెంజ్ కలర్ జెర్సీలను వినియోగిస్తుంది. ఆరెంజ్ కలర్ టీ షర్ట్, ఆరెంజ్ కలర్ క్యాప్, బ్లాక్ కలర్ షార్ట్‌తో టీమిండియా ప్రాక్టీస్ జెర్సీ.. చూడడానికి సెమ్ స్విగ్గీ డెలవరీ బాయ్స్ యూనిఫామ్‌లా కనిపిస్తుంది. నిపై స్విగ్గీ ఇండియా కూడా ట్విట్టర్ వేదికగా స్పందించింది. టీమిండియా ప్రాక్టీస్ జెర్సీ చూస్తుంటే ఆరెంజ్ జెర్సీ బాయ్స్, డెలివరీ చేయడానికి రెఢీగా ఉన్నట్టుగా ఉంది అని తెలిపింది.
నేను రోహిత్ శర్మకు ఒక సలహా ఇచ్చాను.. ఆ తర్వాత.. వరల్డ్ కప్‌లో ఏకంగా 5 సెంచరీలను బాదేశాడు అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కూడా వరల్డ్ కప్ ముందు రోహిత్ ఫామ్‌లో లేడు.. ప్రపంచ కప్ కోసమే పరుగులన్నీ దాచిపెట్టుకుంటున్నాడు.. ప్రతీదానికీ ఓ కారణం ఉంటుందని నేను నమ్ముతా.. నా విషయంలోనూ ఇదే జరిగింది అని యువరాజ్ సింగ్ అన్నాడు.