IND vs AUS: మూడో వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్ ఆసీస్ కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Lost 3rd ODI Against Australia: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా కుదిర్చిన 270 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది. 49.1 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో.. ఆస్ట్రేలియా 21 పరుగులతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇది ఆస్ట్రేలియాకు వరుసగా రెండో విజయం కావడంతో.. సిరీస్ ఆసీస్ కైవసం అయ్యింది. మొదట్లో ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కాస్త ఆశాజనకమైన ప్రదర్శనని కనబర్చడంతో.. సునాయాసంగా మ్యాచ్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి, మ్యాచ్‌ని తమవైపుకు తిప్పుకున్నారు.
US Dentist Crime: క్లూ లేకుండా భార్యని చంపాడు.. కానీ చివరికి అలా బుక్కయ్యాడు
Also Read
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్‌గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్‌పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
- Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. 49 ఓవర్లలో 269 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ సాధించలేదు. మిచెల్ మార్ష్ ఒక్కడే 47 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే.. మిగతా బ్యాటర్లు కొద్దోగొప్పో పరుగులతో బాగానే నెట్టుకొచ్చారు. మరీ పేలవ ప్రదర్శన కనబర్చకుండా.. తమ జట్టుకి గౌరవప్రదమైన స్కోరు జోడించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. స్టీవ్ స్మిట్ ఒక్కడే డకౌట్‌గా వెనుదిరగగా.. మిగతా బ్యాటర్లు డబుల్ డిజిట్ స్కోర్లే కొట్టారు. చివరికి బౌలర్లు సైతం.. జట్టుకి స్కోరుని జోడించడంలో తమవంతు కృషి చేశారు. అందుకే.. ఏ ఒక్కరు భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినప్పటికీ.. ఆస్ట్రేలియా జట్టు 269 పరుగులు చేయగలిగింది. భారత్ ముందు 270 పరుగుల లక్ష్యాన్ని పెట్టగలిగింది.
Extramarital Affair: భర్తని వదిలి ప్రియునితో కాపురం.. కట్ చేస్తే ఊహించని దారుణం
ఇక 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. శుభారంభాన్నే అందించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ కలిసి మొదట్లో పరుగుల వర్షం పారించారు. అయితే.. వీళ్లిద్దరు ఔటయ్యాక స్కోర్ బోర్డు నత్తనడకగా సాగింది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మరో వికెట్ పడనివ్వకుండా.. తమ ఇన్నింగ్స్‌ని నిదానంగా కొనసాగించారు. ఈ క్రమంలో కోహ్లీ (54) అర్థశతకంతో మెరిశాడు. వీళ్లు ఔటయ్యాకే మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. హార్దిక్ పాండ్యా (40) ఒక్కడే జట్టుని విజయతీరాలకు తీసుకెళ్లేందుకు సాయశక్తులా ప్రయత్నించాడు. మిగతా వాళ్లెవ్వరూ సరిగ్గా రాణించలేకపోయారు. మరో దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఈ మ్యాచ్‌లో కూడా సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు.
Punjab Kings: పంజాబ్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ.. ఆ విధ్వంసకర బ్యాటర్ దూరం
భారత్ కష్టాల్లో ఉన్నప్పుడల్లా ఆదుకున్న అక్షర్ (2), జడేజా (18) సైతం చేతులెత్తేశారు. సరైన సమయంలో ఆసీస్ బౌలర్లు తమ మాయాజాలం చూపించి.. భారత్‌ని కష్టాల్లో పడేసి, మ్యాచ్‌ని తమవైపుకు తిప్పుకున్నారు. చివర్లో వచ్చిన మహమ్మద్ షమీ ఒక సిక్స్, మరో ఫోర్‌తో ఆశలు రేకెత్తించాడు కానీ.. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. చకచకా వికెట్లు పడ్డాయి. దీంతో.. భారత్ 248 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జట్టులో అద్భుతమైన బ్యాటర్లు ఉన్నప్పటికీ.. కీలక సమయంలో ఆడకపోవడంతో, గెలవాల్సిన మ్యాచ్‌ని భారత్ చేజేతులా కోల్పోవాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్‌తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్‌గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!