Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్-ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఎ ఓటమిపాలైంది. వర్షం కారణంగా డీఎల్ఎస్ విధానంలో అఫ్గాన్ జట్టు విజయం సాధించింది. ఈ ఓటమిపై భారత్-ఎ కెప్టెన్ తిలక్ వర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించిందని, తాము బోర్డుపై ఉంచిన 349 పరుగుల భారీ స్కోరు ఈ వికెట్‌పై ఖచ్చితంగా సరిపోయేదేనని అన్నాడు. అయితే దురదృష్టవశాత్తూ వర్షం పడటం, డీఎల్ఎస్ సమీకరణాల వల్ల మ్యాచ్ ఫలితం మారిపోయిందని అభిప్రాయపడ్డాడు.
పూర్తిగా సాగి ఉంటే ఫలితం వేరేలా ఉండేది..
వర్షం కారణంగా అఫ్గాన్ ఇన్నింగ్స్‌ను 38 ఓవర్లకు కుదించినప్పటికీ తాము మ్యాచ్‌లోనే ఉన్నామని తిలక్ వర్మ తెలిపాడు. తాము అనుకున్న ప్లాన్ ప్రకారం మ్యాచ్ 38 ఓవర్ల పాటు పూర్తిగా సాగి ఉంటే ఖచ్చితంగా ఫలితం వేరేలా ఉండేదని ఆశాభావం వ్యక్తం చేశాడు. అఫ్గాన్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారని మెచ్చుకుంటూనే.. తాము వేసిన కొన్ని బంతులకు వికెట్లు వచ్చే అవకాశాలు ఉన్నా, అవి ఫీల్డర్లకు కొద్దిగా దూరంగా పడటంతో కలిసి రాలేదని చెప్పాడు.
Also Read
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
బౌలింగ్ లోపమేమీ కాదు..
భారత బౌలర్లు పెద్దగా వికెట్లు తీయలేకపోవడంపై స్పందిస్తూ, దీన్ని బౌలింగ్ వైఫల్యంగా లేదా ఆందోళన కలిగించే విషయంగా తాము భావించడం లేదని తిలక్ స్పష్టం చేశాడు. “మా బౌలింగ్ గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. రాబోయే మ్యాచ్‌లకు ముందు మేమంతా కూర్చొని లోపాలను సమీక్షించుకుంటాం. వచ్చే మ్యాచ్‌లో మరింత బలంగా పుంజుకుంటాం” అని ధీమా వ్యక్తం చేశాడు.
టోర్నీలో తమ తదుపరి లక్ష్యం స్పష్టంగా ఉందన్న తిలక్ వర్మ.. రాబోయే రెండు మ్యాచ్‌ల్లోనూ ఖచ్చితంగా గెలిచి తీరుతామని, ఈ ముక్కోణపు సిరీస్ ఫైనల్లో అడుగుపెట్టడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాడు.
మ్యాచ్ హైలైట్స్..
భారత్-ఎ స్కోరు 49 ఓవర్లలో 349/9 (ప్రభ్‌సిమ్రన్ సింగ్ 84, రుతురాజ్ గైక్వాడ్ 66, తిలక్ వర్మ 66), అఫ్గాన్-ఎ స్కోరు 25.5 ఓవర్లలో 177/2 (ఇమ్రాన్ మిర్ 75 నాటౌట్, బహీర్ షా 51 నాటౌట్). వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోవడంతో డీఎల్ఎస్ విధానం ప్రకారం అఫ్గానిస్థాన్-ఎ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!