ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా మూడో స్థానంతో తన ప్రస్థానం ముగించింది. జకార్తా వేదికగా జపాన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో 1-0 తేడాతో విజయం సాధించి కాంస్య పతకం అందుకుంది. తొలి క్వార్టర్లోనే ఏడో నిమిషంలో రాజ్‌కుమార్ పాల్ ఏకైక గోల్ చేశాడు. ఆ తర్వాత రెండు జట్లు గోల్స్ కోసం చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఈ టోర్నీలో టీమ్‌ఇండియా అనూహ్య ఓటములు చవిచూసింది. కానీ కీలకమైన మ్యాచుల్లో నెగ్గింది. సూపర్-4కు అర్హత సాధించేందుకు ఇండోనేషియా మ్యాచులో…