ఇంగ్లండ్‌లో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు భారత్ 13 పతకాలను తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
కామన్వెల్త్ క్రీడల్లో మంగళవారం భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు వచ్చి చేరాయి. భారత అథ్లెట్లు మంగళవారం కామన్వెల్త్ క్రీడల్లో పసిడి మోత మోగించారు. అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన అమ్మాయిలు లాన్‌బౌల్స్ ఫోర్స్ విభాగంలో చారిత్రాత్మక విజయంతో తొలి స్వర్ణాన్ని అందించారు.
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో లాన్ బౌల్స్‌లో భారత్ మంగళవారం చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. మహిళల ఫోర్స్ లాన్ బౌల్స్ ఫైనల్లో భారత్ 17-10తో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ విజయం భారత్‌కు ప్రచారంలో నాల్గవ బంగారు పతకాన్ని అందించింది.
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత లాన్ బౌల్స్ మహిళల జట్టు బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ బంగారు పతకంతో భారత్ మొత్తానికి నాలుగో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నట్లెంది.
CommonWealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ దూసుకుపోతోంది. భారత్ ఖాతాలో మరో పతకం ఖాయమైంది. లాన్ బౌల్స్ క్రీడలో ఇండియాకు రజతం లేదా స్వర్ణ పతకం వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. ఆదివారం జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో లాన్ బౌల్స్ క్రీడా పోటీల్లో నార్ఫోక్ ఐలాండ్‌ను ఓడించి భారత మహిళల ఫోర్స్ జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను భారత్ 16-13 తేడాతో…