IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!
- సంజు శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత్ సెమీఫైనల్‌కు
- 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమ్ ఇండియా
- తిలక్ వర్మ, శివం దూబే కీలక పాత్ర
- పోరాడి ఓడిన వెస్టిండీస్.. వరల్డ్ కప్ ప్రయాణం ముగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup : టీ20 వరల్డ్ కప్‌లో భారత్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సంజు శాంసన్ తన కెరీర్‌లోనే చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనే అభిషేక్ శర్మ (10), ఇషాన్ కిషన్ (10) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. సూర్య (18) త్వరగానే అవుట్ అయినప్పటికీ, శాంసన్ ఏమాత్రం తడబడకుండా విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ ఛేజింగ్‌లో ఒక భారత బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరుగా శాంసన్ రికార్డు సృష్టించాడు.
Also Read
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
- IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
- CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
- IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్‌పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
శాంసన్‌కు తోడుగా యువ ఆటగాడు తిలక్ వర్మ (15 బంతుల్లో 27 పరుగులు 4 ఫోర్లు, 1 సిక్సర్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (17) కీలక సమయంలో అవుట్ అవ్వగా, శివం దూబే (8*) వరుసగా రెండు ఫోర్లు బాది ఒత్తిడిని తగ్గించాడు. చివరి ఓవర్‌లో 7 పరుగులు అవసరమైన దశలో రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో శాంసన్ ఒక సిక్సర్, ఒక ఫోర్ బాది 199 పరుగులతో విజయకేతనం ఎగురవేశాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. విండీస్ బ్యాటర్లు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నప్పటికీ, భారత బ్యాటింగ్ పటిమ ముందు ఆ స్కోరు సరిపోలేదు. విండీస్ బౌలర్లలో షమర్ జోసెఫ్, జేసన్ హోల్డర్ తలో రెండు వికెట్లు తీశారు. అయితే ఆఖరి ఓవర్లలో ఓవర్ రేట్ పెనాల్టీ కారణంగా విండీస్ అదనపు ఫీల్డర్‌ను సర్కిల్‌లో ఉంచాల్సి రావడం భారత్‌కు కలిసొచ్చింది. ఈ విజయంతో వెస్టిండీస్ వరల్డ్ కప్ ప్రయాణం ముగియగా, భారత్ సగర్వంగా సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. అత ఇన్నింగ్స్ ఆడిన సంజు శాంసన్ మ్యాచ్ హీరోగా నిలిచాడు. గెలుపు అనంతరం శాంసన్ మోకాళ్లపై కూర్చుని తన హెల్మెట్ తీసి ప్రార్థన చేసుకున్న దృశ్యం అభిమానులను ఆకట్టుకుంది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్‌కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!