IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Key Reasons for India’s Defeat vs West Indies: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ ఓటమిని చవిచూసింది. మొదట విండీస్ 3 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోరు చేసింది. టీమిండియా 19.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. 24 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించిన వెస్టిండీస్.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-2తో సమం చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ శాయ్ హోప్ సెంచరీతో చెలరేగగా, కీమో పాల్ ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. భారీ లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు పోరాడినప్పటికీ.. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో పరాజయం తప్పలేదు. జట్టులోని బయటర్లు అందరూ కాటేరమ్మకొడుకులే అయినా.. ఒక్కరు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. భారత్ ఓటమికి కారణాలు ఏంటో ఓసారి చూద్దాం.
శాయ్ హోప్ విధ్వంసకర సెంచరీ:
వెస్టిండీస్ భారీ స్కోరు సాధించడంలో కెప్టెన్ శాయ్ హోప్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 50 బంతుల్లోనే అజేయంగా 102 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో తొమ్మిది సిక్సర్లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. బౌండరీల మోత మోగిస్తూ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. హోప్ ధాటికి వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ భారీ లక్ష్యం భారత్‌పై ఒత్తిడిని పెంచింది.
Also Read
- Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
- Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
- Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
భారత బౌలర్ల పేలవ ప్రదర్శన:
భారత్ ఓటమికి ప్రధాన కారణాల్లో బౌలింగ్ వైఫల్యం ఒకటి. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో వెస్టిండీస్ బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు సాధించారు. భారత బౌలర్లు పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోవడంలో ఇబ్బంది పడ్డారు. అర్ష్‌దీప్ సింగ్ నాలుగు ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మయాంక్ యాదవ్ నాలుగు ఓవర్లలో 52 పరుగులు ఇచ్చినా వికెట్ దక్కించుకోలేకపోయాడు. అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మైదానంలోని చిన్న, పెద్ద బౌండరీలను వెస్టిండీస్ బ్యాటర్లు సమర్థంగా ఉపయోగించుకున్నారు. పిచ్‌పైకి వచ్చి షాట్లు ఆడుతూ భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. దీంతో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించగలిగింది. భారత బౌలర్లు తేలిపోయిన అదే పిచ్‌పై విండీస్ బౌలర్లు రాణించారు.
సంజూ శాంసన్, తిలక్ వర్మ పోరాటం వృథా:
248 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు సంజు శాంసన్ అద్భుత ఆరంభాన్ని అందించాడు. కేవలం 23 బంతుల్లోనే 56 పరుగులు సాధించి ఛేదనపై ఆశలు రేకెత్తించాడు. తిలక్ వర్మ కూడా 43 పరుగులతో కీలక సహకారం అందించాడు. వీరిద్దరి దూకుడుతో భారత్ లక్ష్యం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. అయితే కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోవడం భారత్‌ను దెబ్బతీసింది. టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. క్రీజులో నిలదొక్కుకుని ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే భాగస్వామ్యం లేకపోవడంతో పరుగుల వేగం తగ్గిపోయింది. టాప్ ఆర్డర్లో మరో మంచి భాగస్వామ్యం నమోదైతే ఫలితం మరోలా ఉండేది.
కీమో పాల్ ఐదు వికెట్లతో దెబ్బ
వెస్టిండీస్ బౌలర్ కీమో పాల్ భారత బ్యాటింగ్‌ను కుప్పకూల్చాడు. నాలుగు ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను వెస్టిండీస్ వైపు తిప్పాడు. మరోవైపు గుడాకేశ్ మోటీ కూడా కీలక సమయంలో రెండు వికెట్లు తీసి భారత్‌పై ఒత్తిడి పెంచాడు. భారత బ్యాటర్లు దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్లు కోల్పోవడంతో లక్ష్యానికి చేరువ కాలేకపోయారు. చివరికి భారత్ 19.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది.
బెస్ట్ ఫీల్డింగ్:
వెస్టిండీస్ బ్యాటర్లు పిచ్‌లోకి దూసుకెళ్తూ బౌండరీలను బాదారు. పిచ్‌ను వారు సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. అదే సమయంలో విండీస్ ఫీల్డర్లు ఒత్తిడిలో కూడా ప్రతి క్యాచ్‌ను పట్టుకున్నారు. సంజు శాంసన్ అద్భుత క్యాచ్ కారణంగానే పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌లను కూడా ఎలాంటి పొరపాటు చేయకుండా ఒడిసిపట్టుకున్నారు. అంతకుముందు మన ఫీల్డర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
తాజావార్తలు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..