IND vs SL Test Series: శ్రీలంక పర్యటన.. టీమిండియా ప్లాన్‌లో భారీ మార్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SL Warm-Up Match Shortened: శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియా సన్నాహకాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. భారత జట్టు శ్రీలంకలో స్థానిక జట్టుతో ఆడాల్సిన వార్మప్ మ్యాచ్‌ను నాలుగు రోజుల నుంచి మూడు రోజులకు కుదించినట్లు సమాచారం. తొలుత నాలుగు రోజుల పాటు ఈ మ్యాచ్ నిర్వహించాలని భావించినప్పటికీ.. ఇప్పుడు ఆగస్టు 7 నుంచి 9 వరకు మాత్రమే ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మార్పు గురించి బీసీసీఐతో పాటు భారత జట్టు యాజమాన్యానికి కూడా సమాచారం అందించినప్పటికీ.. దీనికి గల కారణాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.
కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానానికి సమీపంలో ఉన్న ఎన్సీసీ గ్రౌండ్లో ఈ వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ప్రత్యక్ష ప్రసారం కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై అలవాటు పడేందుకు ఈ మ్యాచ్ భారత ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడనుంది. ముఖ్యంగా బ్యాటర్లు, స్పిన్నర్లు మ్యాచ్ పరిస్థితులకు తగిన విధంగా సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది.
Also Read
- India vs Sri Lanka: గంభీర్‌కు అగ్ని పరీక్ష.. కెప్టెన్ గిల్‌కు బిగ్ సవాల్.. 7 టెస్టులు గెలవాల్సిందే!
- Mumbai Indians: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా?.. రూమర్లపై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్!
- Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
- Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుమలలో హార్దిక్ పాండ్యా.. శ్రీవారికి తలనీలాలు సమర్పించి కొత్త లుక్‌తో షాక్..!
భారత్‌కు శ్రీలంక టెస్టు సిరీస్ అత్యంత కీలకంగా మారింది. గతేడాది స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయిన భారత్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో మెరుగైన ఫలితాలు సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే శ్రీలంక పర్యటనను విజయంతో ప్రారంభించాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుండగా.. రెండో టెస్టు ఆగస్టు 19 నుంచి జరగనుంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత భారత జట్టు శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడబోతోంది. చివరిసారిగా 2017లో శ్రీలంకలో భారత్ టెస్టు సిరీస్ ఆడింది. అంతేకాకుండా 2008 తర్వాత భారత్‌పై శ్రీలంక టెస్టు సిరీస్ గెలవలేదు. ఈ గణాంకాలు కూడా భారత జట్టుకు ఊరట కలిగిస్తున్నాయి.
తాజావార్తలు
-
IND vs SL Test Series: శ్రీలంక పర్యటన.. టీమిండియా ప్లాన్‌లో భారీ మార్పు!
-
Rice Price Hike: సన్నబియ్యం ధరల షాక్.. రెండు నెలల్లోనే క్వింటాల్‌పై రూ.2 వేల పెరుగుదల!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
-
Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!