బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతుండగా.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) శుక్రవారం భారత్‌తో సిరీస్ కోసం కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. బీసీబీ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 1, 3, 6 తేదీల్లో వన్డేలు.. సెప్టెంబర్ 9, 12, 13 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టు ఆగస్టు 28న బంగ్లాదేశ్ చేరుకుంటుంది. ప్రస్తుత పరిస్థితి, బంగ్లాదేశ్‌లో స్థిరమైన ప్రభుత్వం లేకపోవడంతో.. బీసీసీఐ ఈ పర్యటనకు అంగీకరిస్తుందో లేదో చూడాలి.
గత ఏడాది జూలైలో బంగ్లాదేశ్‌లో భారత్ పర్యటించాల్సి ఉంది. షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలడంతో.. బంగ్లాలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. బంగ్లాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా సిరీస్ నిరవధికంగా వాయిదా పడింది. వన్డే, టీ20 సిరీస్‌లను ఒక సంవత్సరానికి పైగా బీసీబీ, బీసీసీఐ వాయిదా వేశాయి. ‘రెండు బోర్డుల మధ్య చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది. సెప్టెంబర్ 2026లో జరిగే ఈ సిరీస్ కోసం భారతదేశాన్ని స్వాగతించడానికి బీసీబీ ఎదురుచూస్తోంది’ అని బీసీబీ పేర్కొంది.
Also Read: Ranveer Singh: దీపిక కంటే ముందు.. సందీప్ రెడ్డి వంగా ఆఫర్‌ను తిరస్కరించిన రణవీర్ సింగ్!
బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై జరిగిన హింస, మూకదాడులపై భారతదేశంలో నిరసనలు తీవ్రమయ్యాయి. గత 15 రోజుల్లో దీపు చంద్ర దాస్‌తో సహా నలుగురు హిందువులు చంపబడ్డారు. ఇటీవలి రోజుల్లో అందుకు సంబంధించిన ఫొటోస్ భారతీయులలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. భారతదేశంలోని ప్రముఖ మత, రాజకీయ సంస్థలు ఇందుకు వ్యతిరేకంగా నిరసనను ప్రారంభించాయి. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు వ్యతిరేకంగా కూడా నిరసన జరుగుతోంది. ఐపీఎల్ 2026లో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కేకేఆర్ కొనుగోలు చేయడమే ఇందుకు కారణం. వేలంలో రూ.9.20 కోట్ల భారీ మొత్తానికి రెహమాన్‌ను కేకేఆర్ కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో అతడు పాల్గొనడం సందేహాస్పదంగా ఉంది.