బంగ్లాదేశ్ మహిళా జట్టు ఫాస్ట్ బౌలర్ జహనారా ఆలమ్.. ఆ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీపై తీవ్ర ఆరోపణలు చేసింది. జూనియర్ ఆటగాళ్లను నిగర్ కొట్టేదని, కొన్నిసార్లు అయితే చెంప దెబ్బలు కూడా కొట్టేదని చెప్పింది. డ్రెస్సింగ్ రూమ్‌లో సరైన వాతావరణం కల్పించడంలో బంగ్లా కెప్టెన్ విఫలమైందని పేర్కొంది. చాలా మంది ప్లేయర్లు తమ బాధని చెప్పుకొని బాధపడేవారని జహనారా చెప్పుకొచ్చింది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఈ ఆరోపణలను ఖండించింది. గత ఏడాది…
బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు వరుస షాక్‌లు తగిలాయి. ముందుగా షకీబ్ బౌలింగ్ యాక్షన్‌పై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిషేధం విధించగా.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా నిషేధం విధించింది. అంతర్జాతీయ క్రికెట్ సహా దేశ, విదేశీ బోర్డులకు సంబంధించి ఏ లీగ్‌లలో బౌలింగ్ చేయకుండా ఐసీసీ నిషేధించింది. ఈమేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఓ ప్రకటనను విడుదల చేసింది. షకీబ్ అన్ని రకాల క్రికెట్లో…
సంచలనాల జట్టు బాంగ్లాదేశ్ క్రికెట్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. పేలవమైన ఫామ్ వల్ల మోమినుల్ హక్ బంగ్లాదేశ్ కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం మూడోసారి టెస్ట్ కెప్టెన్‌గా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌ను నియమించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ నెలాఖరులో వెస్టిండీస్‌లో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇక ఈ సిరీస్‌కు ముందు షకీబ్‌ను కెప్టెన్‌గా నియమించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బ్యాట్స్‌మన్ లిటన్ దాస్‌ను కొత్త వైస్ కెప్టెన్‌గా…