Bottle Gourd Juice For Uric Acid: ప్రస్తుత రోజుల్లో ‘యూరిక్ యాసిడ్’ ఒక సాధారణ సమస్యగా మారింది. సరైన జీవనశైలి లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఇందుకు కారణమని చెప్పవచ్చు. యూరిక్ యాసిడ్ ఒక రకమైన శరీర వ్యర్థం. ఇది కీళ్ల నొప్పులు, నడకలో సమస్యలు మరియు పాదాలలో వాపు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. అయితే ఆహారంలో కాస్త మార్పు చేస్తే.. ఈ సమస్యకు ఇట్టే చెక్ పెట్టొచ్చు. మీ రోజువారీ ఆహారంలో సొరకాయ రసాన్ని చేర్చితే.. దాని ప్రభావం కొన్ని రోజుల్లో కనిపిస్తుంది.
సొరకాయలో విటమిన్ బి, విటమిన్ సి మరియు ఐరన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. సొరకాయ రసం తాగితే.. యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉండేలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రసం కోసం తాజాగా తెంపుకున్న సొరకాయ కావాలి. సొరకాయ పొట్టు తీసి.. చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సర్ గ్రైండర్లో వేయండి. ఈ జ్యూస్‌లో నల్ల ఉప్పు కలిపి రోజూ ఉదయం తాగితే.. కీళ్ల నొప్పులు, ఎముకల వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also Read: E-Ticket vs I-Ticket: ఈ-టిక్కెట్, ఐ-టిక్కెట్ అంటే ఏంటి?.. ఈ 2 టిక్కెట్ల మధ్య తేడా, ప్రయోజనాలు ఇవే!
మధుమేహం:
మధుమేహ వ్యాధిగ్రస్తులు సొరకాయ రసంను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని చాలా వరకు నియంత్రించడంలో సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు.. అధిక రక్తపోటు, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి మరియు ట్రిపుల్ నాళాల వ్యాధి వచ్చే ప్రమాదం తలెత్తుతుంది. దీనిని నివారించడానికి క్రమం తప్పకుండా సొరకాయ రసం త్రాగాలి.
బరువు:
ప్రస్తుత కాలంలో బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితిలో సొరకాయ రసం మీ నడుము మరియు పొట్ట కొవ్వును తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. ఎందుకంటే ఈ కూరగాయలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.